తెలుగు న్యూస్  /  National International  /  Gujarat Himachal Pradesh Assembly Election Results 2022 Today Know Timings Votes Counting Live Details

Gujarat Elections Results: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నేడే.. బీజేపీ పట్టునిలుపుకుంటుందా!

08 December 2022, 6:54 IST

    • Gujarat, Himachal Pradesh Assembly Election Results 2022: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ తరుణంలో రిజల్ట్స్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.
Gujarat Elections Results: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నేడే..
Gujarat Elections Results: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నేడే.. (HT_PRINT)

Gujarat Elections Results: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నేడే..

Gujarat, Himachal Pradesh Assembly Election Results 2022: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు నేడు (డిసెంబర్ 8) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ కానుంది. గుజరాత్‍ను 27 సంవత్సరాల నుంచి పాలిస్తున్న భారతతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party -BJP) మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు దీమాగా ఉన్నారు. ఆ రాష్ట్రంలోకి కొత్తగా అడుగుపెట్టిన ఆమ్‍‍ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP) బలమైన ప్రభావం చూపించాలని పట్టుదలగా ఉంది. ఇక పూర్వవైభవాన్ని కాంగ్రెస్ (Congress) ఆశిస్తోంది. ఈ ఆకాంక్షలన్నింటికీ నేడు సమాధానం దొరకనుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. హిమాచల్ ప్రదేశ్‍లోనూ నేడే ఫలితం తేలనుంది. హిమాచల్‍లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కనిపించే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

JEE Advanced 2024 : నేడు జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

గుజరాత్‍లో..

Gujarat Election Results: 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 1వ తేదీ తొలి దశ, 5వ తేదీ రెండో దశ ఓటింగ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్‍లో 59.11 శాతం, రెండో విడతలో 63.14 శాతం పోలింగ్ నమోదైంది. ఇక పోలింగ్ తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అన్నీ అధికార బీజేపీదే మళ్లీ విజయమని అంచనా వేశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంతగడ్డ గుజరాత్‍లో కషాయ పార్టీ వరుసగా ఏడోసారి గెలుస్తుందని స్పష్టం చేశాయి. గుజరాత్‍లో 27 సంవత్సరాలుగా అధికారం చెలాయిస్తున్న కమల దళం.. మళ్లీ పగ్గాలు చేపడుతుందని వెల్లడించాయి. కాంగ్రెస్ రెండు, ఆమ్‍ఆద్మీ మూడో స్థానంలో ఉంటాయని వెల్లడించాయి. మొత్తంగా 1,621 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది.

Gujarat Assembly Polls Results: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. 37 కేంద్రాల్లో లెక్కింపు ఉంటుంది. 182 మంది కౌంటింగ్ అబ్జర్వర్లు, 182 మంది ఎలక్షన్ ఆఫీసర్లు, 494 మంది అసిస్టెంట్ ఆఫీసర్లను లెక్కింపు ప్రక్రియ కోసం నియమించినట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అలాగే అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లతో పాటు అదనంగా మరికొంత మంది సిబ్బంది కూడా విధుల్లో ఉంటారు.

హిమాచల్.. హోరాహోరీ

Himachal Pradesh Elections Results 2022: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా నేడు (డిసెంబర్ 8) వెల్లడి కానున్నాయి. 68 స్థానాల కోసం 412 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే హిమాచల్‍లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. పోరు హోరాహోరీగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‍లో సాధారణంగా ప్రతీ ఐదేళ్లకు ప్రభుత్వం మారుతుంటుంది. అయితే ఆ ట్రెండ్‍ను మారుస్తూ మళ్లీ గెలుస్తామని అధికార బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే, మరోసారి హిమాచల్‍లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ దీమా వ్యక్తం చేస్తోంది. ఆమ్‍ఆద్మీతో పాటు ఇతర పార్టీల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గత నెల 12వ తేదీన జరిగింది. 75.6 శాతం ఓటింగ్ నమోదైంది.

Himachal Prade Assembly Polls Results: హిమాచల్ ప్రదేశ్‍లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పాయి. అయితే అధికార బీజేపీకి కొన్ని సర్వేలు మొగ్గుచూపాయి. మరోవైపు హంగ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా అంచనాలు ఉన్నాయి. ఇలా జరిగితే ఇండిపెండెంట్లు కీలకపాత్ర పోషిస్తారు. హిమాచల్‍లో అధికారంలోకి రావాలంటే 35 సీట్ల మెజార్టీ మార్కును సాధించాలి.