Himachal Pradesh Exit Polls: హిమాచల్ ప్రదేశ్‍లో ఉత్కంఠే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
Himachal Pradesh Exit Polls: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని తేలింది.
Himachal Pradesh Exit Polls 2022: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా-నేనా అన్నట్టు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టం చేశాయి. రెండు పార్టీల మధ్య వ్యత్యాసం చాలా అత్యల్పంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించాయి. మొత్తంగా అయితే హిమాచల్ శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ మరింత ఆసక్తిని రేకెత్తించాయి. హిమాచల్ ప్రదేశ్‍లో 68 అసెంబ్లీ స్థానాలకు గత నెల 12న పోలింగ్ జరిగింది. 74.54 పోలింగ్ శాతం నమోదైంది. హిమాచల్‍లో అధికారంలోకి రావాలంటే 35 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. గుజరాత్ ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియటంతో.. హిమాచల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నేడు (డిసెంబర్ 5) వెల్లడయ్యాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ఇవి సూచిస్తున్నాయి. అయితే కమలం పార్టీ కాస్త ఆధిక్యంలో ఉండే అవకాశం ఉందని తెలుపుతున్నాయి. పూర్తి వివరాలివే..
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా
- బీజేపీ: 24-34
- కాంగ్రెస్: 30-40
- ఆమ్ఆద్మీ: 0
- ఇతరులు: 4-8
రిపబ్లిక్ టీవీ పీ-మార్క్య్
- బీజేపీ: 34-39
- కాంగ్రెస్: 28-33
- ఆమ్ఆద్మీ: 00-01
- ఇతరులు: 01-04
న్యూస్ ఎక్స్ - జన్ కీ బాత్
- బీజేపీ: 32-40
- కాంగ్రెస్: 27-34
- ఆమ్ఆద్మీ: 0
- ఇతరులు: 02-01
పీపుల్స్ పల్స్
- కాంగ్రెస్: 29-39
- బీజేపీ: 27-37
- ఆమ్ఆద్మీ: 0
- ఇతరులు: 2-5
టీవీ9 నెట్‍వర్క్
- బీజేపీ: 33
- కాంగ్రెస్: 31
- ఆమ్ఆద్మీ: 0
- ఇతరులు: 4
టైమ్స్ నౌ - ఈటీజీ
- బీజేపీ: 34-42
- కాంగ్రెస్: 24-32
- ఆమ్ఆద్మీ: 0
- ఇతరులు: 1-3
ఇండియా టీవీ - మ్యాట్రిజ్
- బీజేపీ: 35-40
- కాంగ్రెస్: 26-31
- ఆమ్ఆద్మీ: 0
- ఇతరులు: 4-3
2017 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 44 సీట్లను సాధించి బీజేపీ అధికారం దక్కించుకుంది. అయితే ఈసారి హోరాహోరీ కచ్చితం అనేలా పరిస్థితి కనిపిస్తోంది. ప్రతీ ఐదేళ్లకు ఓసారి హిమాచల్‍లో అధికారం చేతులు మారుతుంటుంది. 1985 నుంచి బీజేపీ, కాంగ్రెస్ ఒక్కోసారి అధికారంలోకి వచ్చాయి. వరుసగా రెండుసార్లు ఏదీ గెలువలేదు. మరి ఈ సంప్రదాయం ముగిసి..బీజేపీ అధికారంలో కొనసాగుతుందా.. కాంగ్రెస్ మరోసారి పీఠం దక్కించుకుంటుందా అనేది చూడాలి. ఈనెల 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.