11ఏళ్ల బాలికపై అత్యాచారం.. చివరికి చంపేసి..
21 February 2022, 19:35 IST
Gujarat crime news | ఓ 11ఏళ్ల బాలిక అపహరణకు గురైన ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో కలకలం రేపింది. దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి చంపేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
11ఏళ్ల బాలికపై అత్యాచారం.. చివరికి చంపేసి..
Surat crime news | గుజరాత్లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఎవరూ లేని సమయంలో..
సూరత్‌కు 15కీ.మీల దూరంలో ఉన్న పల్సానా పట్టణంలో ఈ ఘటన జరిగింది. 11ఏళ్ల బాలికను ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టి, ఆమె తల్లిదండ్రులు ఆదివారం బయటకు వెళ్లారు. ఆ తర్వాత.. దుండగులు.. ఆ బాలికను సమీపంలోని మరో ప్లాట్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కొన్ని గంటల తర్వాత.. ఇంటికి తిరిగెళ్లిన తల్లిదండ్రులకు ఆ బాలిక కనిపించలేదు. దీంతో భయాందోళనకు గురైన వారు.. సమీప ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి, తమ ఇంటికీ సమీపంలోని ఓ నివాసంలోని గదిని బద్దలు కొట్టేసరికి.. తీవ్రగాయాలతో ఉన్న బాధితురాలు కనిపించింది. ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లారు. అనంతరం పోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.