Crime news : 14ఏళ్ల బాలికపై రౌడీ అత్యాచారం.. సిగరెట్‌తో కాల్చి, గుండు కొట్టించి..!
21 November 2023, 6:48 IST
Crime news : ఓ రౌడీ షీటర్.. ఓ 14ఏళ్ల బాలికను రేప్ చేశాడు. ఆమెను సిగరెట్‌తో కాల్చి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
14ఏళ్ల బాలికపై రౌడీ అత్యాచారం.. సిగరెట్లతో కాల్చి, గుండు కొట్టించి..!
Maharashtra crime news : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పేరుమోసిన రౌడీ షీటర్.. ఓ 14ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా.. సిగరెట్‌తో ఆమె శరీరాన్ని కాల్చి, తలకు గుండు కొట్టించాడు!
ఇదీ జరిగింది..
మహారాష్ట్ర అకోలా నగరంలో జరిగింది ఈ ఘటన. ఖాదాన్ అనే ప్రాంతంలో.. గణేశ్ కుమ్రే అనే 29ఏళ్ల రౌడీ ఉన్నాడు. అతనికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. కాగా.. స్థానికంగా కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తెపై అతని కన్నుపడింది. ప్రస్తుతం ఆమె వయస్సు 14ఏళ్లు. కుమ్రే.. ఆ బాలికను రెండేళ్లుగా వేధిస్తున్నాడు!
ఈ నెల 15న, 16వ తేదీల్లో.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు కుమ్రే. సిగరెట్ బట్స్‌తో చిత్రహింసలకు గురిచేశాడు. జట్టు కత్తిరించేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు.. ఆగ్రహంతో ఊగిపోయారు. కుమ్రేకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Rowdy sheeter raped minor : ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి.. ఈ నెల 18న కుమ్రేని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 363, 354, 376 కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌కు తరలించారు.
'బాధితురాలికి న్యాయం చేస్తాము..'
ఓ రౌడీ.. బాలికను రేప్ చేసి, చిత్రహింసలు గురిచేశాడన్న విషయం.. మహారాష్ట్రలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్.. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు.
Man raped minor girl : "నిందితుడిని విడిచిపెట్టాము. కఠినంగా శిక్షిస్తాము. ఘటనపై దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించాను," అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి దేవేంద్ర ఫడణవీస్ మీడియాకు వెల్లడించారు.
ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.