Man kills daughter : కూతురికి కరెంట్​ షాక్​ ఇచ్చి, చిత్రహింసలు పెట్టి చంపిన తండ్రి!-pakistan crime news man kills daughter in khyber pakhtunkhwas mardan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Kills Daughter : కూతురికి కరెంట్​ షాక్​ ఇచ్చి, చిత్రహింసలు పెట్టి చంపిన తండ్రి!

Man kills daughter : కూతురికి కరెంట్​ షాక్​ ఇచ్చి, చిత్రహింసలు పెట్టి చంపిన తండ్రి!

Sharath Chitturi HT Telugu
Aug 13, 2023 11:05 AM IST

Man kills daughter : పాకిస్థాన్​లో ఓ వ్యక్తి, తన బిడ్డను కిరాతకంగా చంపేశాడు! కరెంట్​ షాక్​ ఇచ్చి, చిత్రహింసలు పెట్టి హత్య చేశాడు.

కూతురికి కరెంట్​ షాక్​ ఇచ్చి చంపిన తండ్రి!
కూతురికి కరెంట్​ షాక్​ ఇచ్చి చంపిన తండ్రి!

Man kills daughter in Pakistan : పాకిస్థాన్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి, తన కూతురిని అతి కిరాతకంగా చంపేశాడు. కరెంట్​ షాక్​ ఇచ్చి, చిత్రహింసలు పెట్టి హత్య చేశాడు!

ఇదీ జరిగింది..

పాకిస్థాన్​ ఖైబర్​ పఖ్తుంక్వాలోని మర్దాన్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు జహూర్​. అతనికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య, అతడిని విడిచి పెట్టి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇతను కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు.

కాగా.. మొదటి భార్యతో జహూర్​కు ఓ కూతురు ఉంది. ఆమె మైనర్​. అసలు కారణం తెలియలేదు కానీ.. జహూర్​, ఆమెను నిత్యం చిత్రహింసలు పెట్టేవాడని సమాచారం.

Father kills daughter in Pakistan : తాజాగా.. బాలిక తాత, ఆమెకు కొన్ని చాక్లెట్లు, ఇతర వస్తువులను తీసుకొచ్చాడు. అది జహూర్​కు నచ్చలేదు! వెంటనే ఆమెను చిత్రహింసలు పెట్టాడు. కరెంట్​ షాక్​ ఇచ్చాడు.

బాలికను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. మరణానికి ముందు బాలిక చాలా చిత్రహింసలకు గురైందని వెల్లడించారు.

బాలిక బంధువుల ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు జహూర్​ను వెంటనే అరెస్ట్​ చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

పంజాబ్​ రాష్ట్రంలో..

Pakistan crime news : పాకిస్థాన్​లో నేరాలు చాలా ఆందోళనకరంగా మారాయి. పంజాబ్​ రాష్ట్రంలో 8 నెలల పసికందును చంపేశారు తల్లిదండ్రులు. ఎవరికీ తెలియకూడదని, భూమిలో పాతి పెట్టారు. కానీ ఈ సమాచారం పోలీసులకు అందగా.. తల్లిదండ్రులను అరెస్ట్​ చేశారు.

ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న షరీఫ్​.. నిజాన్ని ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి పోలీసులను తీసుకెళ్లారు. పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

"8నెలలుగా నిత్యం ఆ బిడ్డ అనారోగ్యంతోనే ఉంటోంది. మేము పేదవాళ్లం. వైద్యానికి సరిపడా డబ్బులు లేవు. అందుకే చంపేద్దామని నిర్ణయించుకున్నాము," అని నిందితుడు పోలీసులకు వివరించాడు.

మహిళలపై నేరాలు, అత్యాచారాలు..

పాకిస్థాన్​లో మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి జూన్​లో ఓ నివేదికను విడుదల చేసింది ఎస్​ఎస్​డీఓ (సస్టైనెబుల్​ సోషల్​ డెవలప్​మెంట్​ ఆర్గనైజేషన్​). ఒక్క సింధ్​ రాష్ట్రంలోనే ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో 900కుపైగా కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది.

Crime againt women in Pakistan : 2023 మొదటి నాలుగు నెలల్లో 529 మహిళలు కిడ్నాప్​ అయ్యారని, 119మంది గృహ హింసకు గురయ్యారని, 56మందిపై అత్యాచారం జరిగిందని, 37మంది పరువు హత్యకు బలయ్యారని నివేదిక స్పష్టం చేసింది. కరాచీ సెంట్రల్​, హైదరాబాద్​తో పాటు ఇతర జిల్లాల్లో పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది.

మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని, వారి భద్రత కోసం తగిన చర్యలు చేపట్టాలని నివేదిక విజ్ఞప్తి చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం