UP crime news : మైనర్ల చేత మూత్రం తాగించి.. మలద్వారంలో కారం వేసి!-2 minors suspected of theft forced to drink urine tortured with chillies in up ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Up Crime News : మైనర్ల చేత మూత్రం తాగించి.. మలద్వారంలో కారం వేసి!

UP crime news : మైనర్ల చేత మూత్రం తాగించి.. మలద్వారంలో కారం వేసి!

Sharath Chitturi HT Telugu
Aug 06, 2023 01:35 PM IST

UP crime news : దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు కొందరు! ఆ తర్వాత వారి చేత మూత్రం తాగించారు. మలద్వారంలో పచ్చి కారం వేశారు!

దొంగతనం చేశారన్న అనుమానంతో.. మూత్రం తాగించి!
దొంగతనం చేశారన్న అనుమానంతో.. మూత్రం తాగించి!

UP crime news : ఉత్తర్​ ప్రదేశ్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనానికి పాల్పడ్డారన్న అనుమానంతో.. ఇద్దరు మైనర్లపై కొందరు దాడి చేశారు. వారి చేత మూత్రం తాగించారు. అంతేకాకుండా.. వారి ప్యాంట్లు విప్పి, మలద్వారంలో పచ్చి కారం వేశారు!

అమానవీయ ఘటన..

ఉత్తర్​ప్రదేశ్​ సిద్ధార్థనగర్​ జిల్లాలో ఆగస్ట్​ 4న ఈ దారుణం జరిగింది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన దృశ్యాలు శనివారం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. మొదటి వీడియోలో కొందరు.. ఇద్దరు మైనర్లను పట్టుకున్నట్టు కనిపిస్తోంది. దుండగులు తొలుత మైనర్ల చేత పచ్చి కారం తినిపించారు. ఆ తర్వాత బాటిల్​లో మూత్రం పోసి, తాగించారు. అసభ్యకర పదజాలంతో తిట్టారు. కొట్టారు.

రెండో వీడియో దృశ్యాలు మరింత ఘోరంగా ఉన్నాయి. దుండగులు ఆ ఇద్దరు మైనర్లను కట్టేసి, కింద పడుకోపెట్టారు. ఆ తర్వాత వారి ప్యాంట్లను విప్పారు. ఇద్దరి మలద్వారాల్లో పచ్చి కారం పోసి, రుద్దారు. బాధతో ఆ అబ్బాయిలు గట్టిగా అరిచారు. ఆ తర్వాత యెల్లో రంగులో ఉన్న లిక్విడ్​తో ఓ ఇంజెక్షన్​ ఇచ్చారు దుండగులు. ఆ లిక్విడ్​ ఏంటన్నది తెలియరాలేదు.

చికెన్​ కొట్టులో దొంగతనం చేశారని..!

Minors made to drink urine : ఈ ఘటనకు సంబధించిన రెండు, మూడు వీడియోలు తొలుత వాట్సాప్​లోని ఓ స్టూడెంట్​ గ్రూప్​లో వైరల్​ అయ్యాయి. అదే గ్రూప్​లో ఉన్న ఓ కానిస్టేబుల్​.. వాటిని చూసి, తన పై అధికారికి సమాచారం అందించారు. వీడియోను పరిశీలించిన అధికారులు.. ఘటనపై కేసు నమోదు చేసుకుని, సంబంధిత దుకాణాన్ని ట్రేస్​ చేశారు. పథ్రా బజార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కోంకటి క్రాసింగ్​ వద్ద ఆ పౌల్ట్రీ షాపు ఉందని గుర్తించారు.

ఆ దుకాణానికి వెళ్లిన పోలీసులు.. అక్కడే ఉన్న యజమానిని ప్రశ్నించారు. తొలుత తాను ఏం చేయలేదని మహమ్మద్​ సౌద్​ పోలీసులకు చెప్పాడు. కానీ అధికారులు వీడియో చూపించిన తర్వాత నిజాన్ని ఒప్పుకున్నాడు. అసలేం జరిగిందనేది, తన వర్షెన్​ను చెప్పుకొచ్చాడు.

Uttar Pradesh crime news latest : "ఆగస్ట్​ 4న నా దుకాణానికి ఓ కస్టమర్​ వచ్చాడు. నేను ఆయనతో బయట మాట్లాడుతుండగా.. ఓ ఇద్దరు దుకాణంలోకి చొరబడ్డారు. చికెన్​ దొంగలించారు. డబ్బులను కూడా తీసుకోవాలని ప్రయత్నించారు. మేము వారిని అడ్డుకున్నాము. వారు పారిపోతుండగా.. మేము పట్టుకున్నాము. వారికి గుణపాఠం చెప్పాలనే ఇలా చేశాము," అని మహమ్మద్​ సౌద్​ వివరించాడు.

మహమ్మద్​ సౌద్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు.. అతడిని విచారించారు. అబ్దుల్​, ఉబైద్​, అకీర్​, పప్పు, దీపక్​ గుప్తాలు తనకు సాయం చేసినట్టు అంగీకరించాడు సౌద్​. వారందరిని కూడా ఆరెస్ట్​ చేశారు.

మరోవైపు మైనర్ల వయస్సు 10,14 అని పోలీసులు తెలుసుకున్నారు. వారి ఇళ్లకు వెళ్లి, వారిని విచారించారు. 14ఏళ్ల వయస్సు ఉన్న మైనర్​ తల్లి.. సంబంధిత వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం