Gold Rates| భారీగా పెరిగిన బంగారం.. ఉక్రెయిన్ సంక్షోభంతో బులియన్ మార్కెట్ విలవిల
25 February 2022, 7:05 IST
- ఈ రోజు(ఫిబ్రవరి 25) బంగారం ధర భారీగా పెరిగింది. ఇదే సమయంలో వెండి కూడా ఆకాశాన్నంటడం గమనార్హం. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1250 పెరిగి 47,250లు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.1370లు పెరిగి రూ.51,550లకు చేరింది.
ఉక్రెయిన్ సంక్షోభంతో భారీగా పెరిగిన పసిడి, వెండి
గత కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరలు రోజు రోజుకు క్రమంగా పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా పసిడి ఇటీవల కాలంలో నిత్యం పెరుగుతూ వినియోగదారులకు అందని ద్రాక్షగా మారింది. అయితే ఉక్రెయిన్ సంక్షోభంతో అంతర్జాతీయంగా పసిడిపై తీవ్రంగా ప్రభావం పడింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో బులియన్ మార్కెట్ విలవిల్లాడింది. మదుపర్లు వెనక్కి తగ్గడంతో మల్టీ కమోడిటీ సూచి 2.41 శాతం పెరిగింది. దీంతో సామాన్యుడిపై పసిడి ధరలు మోతమోగించాయి. నిన్నటితో(గురువారం) పోలిస్తే నేడు(శుక్రవారం-2022 ఫిబ్రవరి 25) బంగారం ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,250లకు చేరింది. ఇదే 8 గ్రాముల బంగారం అయితే రూ.37,800లుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 51,550లుగా ఉంది. 8 గ్రాముల 24 క్యారెట్ల పసిడి వచ్చేసి రూ.41,240లుగా కొనసాగుతుంది. మొత్తం మీద 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1250లు, 24 క్యారెట్ల పసిడిపై రూ.1370 వరకు ధర పెరిగింది.
నగరాల వారీగా బంగారం ధర..
దేశ రాజధానీ దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,250లుగా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.51,550లుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 47,250లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.51,550లుగా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 49,510లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర వచ్చేసి రూ.54,010లుగా ఉంది. మిగిలిన నగరాలతో పోలిస్తే చెన్నైలో కాస్త ఎక్కువగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,250లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,550లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఈ విధంగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర వచ్చేసి రూ.51,550ల వద్ద కొనసాగుతుంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.47,250లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,550లుగా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,250లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,550లుగా కొనసాగుతుంది.
దేశీయంగా కిలో వెండి కూడా భారీగా పెరిగింది. దిల్లీలో కేజీ వెండి ధర రూ.66,600ల వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో రూ.72,700లు ఉండగా.. బెంగళూరులో మాత్రం కిలో వెండి రూ.72,700లుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,700లు, విజయవాడలో రూ.72,700లు, విశాఖపట్నంలోనూ రూ.72,700లుగా ఉంది.