తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia Ukraine | పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. యుద్ధం వద్దని విజ్ఞప్తి!

Russia Ukraine | పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. యుద్ధం వద్దని విజ్ఞప్తి!

HT Telugu Desk HT Telugu

24 February 2022, 23:22 IST

google News
    • భారత ప్రధాని న‌రేంద్ర మోదీ గురువారం రాత్రి రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న తాజా పరిణామాలను అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధానికి వివరించారు.
Prime Minister Narendra Modi greets Russian president Vladimir Putin (File Photo)
Prime Minister Narendra Modi greets Russian president Vladimir Putin (File Photo) (HT PHOTO)

Prime Minister Narendra Modi greets Russian president Vladimir Putin (File Photo)

New Delhi | భారత ప్రధాని న‌రేంద్ర మోదీ గురువారం రాత్రి రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న తాజా పరిణామాలను అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధానికి వివరించారు.

రష్యా- నాటో బృందాల మధ్య విభేదాలు నిజాయితీ, నమ్మకంతో కూడా చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని మోదీ పునరుద్ఘాటించారు. యుద్ధాన్ని విరమించుకోవాలని అధ్యక్షుడు పుతిన్ కు విజ్ఞప్తి చేసినట్లు ప్రధాని తెలిపారు. దౌత్యపరమైన చర్చలకు అన్ని దేశాలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇక, ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి కూడా రష్యా అధ్యక్షుడితో నరేంద్ర మోదీ చర్చించారు. వారందరినీ సురక్షితంగా స్వదేశం తీసుకురావడం ఇండియాకు అత్యంత ప్రాధాన్య అంశం అని మోదీ స్పష్టం చేశారు.

కాగా, ఈ విషయానికి సంబంధించి ఇరు దేశాధినేతల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. ఇండియా- రష్యన్ విదేశాంగ శాఖలు, ఎంబసీ అధికారులు పరస్పరం సహకరించుకుని అవసరమయ్యే ఏర్పాట్లు చేయడం కోసం ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.

టాపిక్

తదుపరి వ్యాసం