తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Going Abroad For Studies?: పై చదువులకు విదేశాలకు వెళ్లేవారు కచ్చితంగా ఇవి పాటించండి..

Going abroad for studies?: పై చదువులకు విదేశాలకు వెళ్లేవారు కచ్చితంగా ఇవి పాటించండి..

23 September 2023, 14:52 IST

  • Going abroad for studies? పై చదువులకు విదేశాలకు వెళ్లడం ఇప్పుడు అత్యంత సాధారణమైంది. అయితే, అక్కడకు వెళ్లిన తరువాత ఈ సూచనలను పాటిస్తే, విదేశాల్లో మీ జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Getty Images/iStockphoto)

ప్రతీకాత్మక చిత్రం

Going abroad for studies? భారత దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతీ ఇంటి నుంచి ఒకరో ఇద్దరో పిల్లలు ఇప్పుడు పై చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడాలకు ఎక్కువగా వెళ్తున్నారు. మన భాష, సంస్కృతి, సంప్రదాయం కాని విదేశాల్లో తమ పిల్లలు ఎలా ఉండారోనన్న ఆందోళన తల్లిదండ్రులకు ఉంటుంది. అయితే, ఈ సింపుల్ టిప్స్ ఫాలో కావడం ద్వారా విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువులు పూర్తి చేయొచ్చు. సెటిల్ కావచ్చు. నిపుణులు చెబుతున్న ఆ టిప్స్ ఏంటంటే..

1) స్థానిక సంప్రదాయాలు, చరిత్ర

మీరు వెళ్తున్న దేశం పాటిస్తున్న సంస్కృతి, సంప్రదాయాల గురించి, వారు గౌరవించే విలువల తెలుసుకోండి. అక్కడి చరిత్ర తెలుసుకోండి. దానిద్వారా మీరు తొందరగా స్థానికులతో కలిసిపోగలరు. స్థానిక సంప్రదాయాలను తెలుసుకోవడం కోసం లోకల్ ఈవెంట్స్ కు వెళ్లడం, సహాధ్యాయులు, సీనియర్లతో మర్యాదగా ఉండడం, వారితో కలిసి పోవడం చేయాలి. స్థానిక వంటకాలను ట్రై చేయండి. అక్కడి చరిత్ర తెలుసుకోండి.

2) స్థానిక భాష

సాధ్యమైనంత త్వరగా అక్కడి వారు అత్యధికంగా మాట్లాడే భాషపై, వారి యాసపై పట్టు సాధించండి. స్థానిక భాష రావడం చాలా ఉపయోగకరం. లోకల్ లాంగ్వేజ్ వస్తే స్థానికుల్లో మీ పట్ల సానుకూలత పెరుగుతుంది. స్థానిక భాష వచ్చి ఉంటే ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. వారి భాష మీకు ఫ్లుయెంట్ గా రాకపోయినా పర్లేదు కానీ కనీసం అర్థ చేసుకుని, సమాధానం ఇవ్వగల స్థాయిలోనైనా నేర్చుకోండి.

3) విభిన్న నేపథ్యాలు

మీరు ఉంటున్న ప్రాంతంలోని స్థానికులతో పాటు, అక్కడికి చదువు, ఉపాధి కోసం వచ్చిన విభిన్న నేపథ్యాలు ఉన్న వ్యక్తులతో సత్సంబంధాలను నెలకొల్పుకోవాలి. మీరు చదువుతున్న విద్యా సంస్థలోని వివిధ దేశాల వారితో ఫ్రెండ్ షిప్ చేయండి. అలాగే, కాలేజ్ ఈవెంట్, ఇంటర్ యూనివర్సిటీ ఈవెంట్స్ లో పాల్గొనండి. అలాంటి కార్యక్రమాలకు హాజరు కండి. కమ్యూనిటీ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయండి. ఇవన్నీ మీకు ఒక మంచి ఇంటర్నేషనల్ నెట్ వర్క్ ఏర్పడేలా సహాయపడ్తాయి. భవిష్యత్తులో మీ కెరియర్ కు కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే, జీవిత కాల స్నేహాలు కూడా ఏర్పడుతాయి.

4) ప్రయాణాలు..

వీలైనప్పుడల్లా కొత్త ప్రాంతాలకు వెళ్లండి. అందుకు అవసరమైన ఖర్చులను సొంతంగా సంపాదించుకునే ప్రయత్నం చేయండి. వివిధ దేశాలు, ప్రాంతాలకు చెందిన స్నేహితులు, క్లాస్ మేట్స్ తో కలిసి వీకెండ్ టూర్స్ ప్లాన్ చేయండి. మీ గ్రూప్ లో ఒకరిద్దరు స్థానికులు ఉంటే మీ ట్రిప్ మరింత బావుంటుంది. కొత్త ప్రాంతానికి వెళ్లడం, అక్కడి చరిత్ర, సంప్రదాయాలను తెలుసుకోవడం కూడా ఒకరంగా నాలెడ్జ్ సంపాదించడమే. ఏదో సమయంలో మీకు అది హెల్ప్ అవుతుంది. అంతేకాదు, ఆ ట్రిప్స్ మీకు జీవితకాల జ్ఞాపకాలను ఇస్తుంది.

5) ఆరోగ్యకర జీవన విధానం..

విదేశాల్లో ఉండడం, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం, ఎక్కువగా స్నేహితులతో కలిసి ఉండడం వల్ల అనారోగ్యకర అలవాట్లకు తొందరగా బానిసలయ్యే అవకాశం ఉంది. ఆ ప్రమాదం నుంచి దూరంగా ఉండండి. ఆరోగ్యకర జీవన విధానాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి. ఆరోగ్యం పాడైతే, చూసుకోవడానికి ఎవరూ దగ్గర్లో ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సరైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయడం కొనసాగించండి. ప్రమాదకర ప్రయాణాలకు దూరంగా ఉండండి.

6) లక్ష్యసాధన

వీటన్నింటితో పాటు లక్ష్యసాధన కోసం కృషి చేయడం మర్చిపోవద్దు. ఏ ఉద్దేశంతో విదేశాలకు వెళ్లామో, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం ఫస్ట్ ప్రయారిటీ గా ఉండాలి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకోండి. వాటిని డైరీలో రాసి పెట్టుకోండి. వాటిపై ఎప్పటికప్పుడు రివ్యూ చేయండి. ఫైనాన్షియల్ గా స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నించండి.

తదుపరి వ్యాసం