Indian students studying abroad : చదువు కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల సంఖ్య ప్రతియేటా పెరుగుతోంది. 2022లో 7,50,365మంది భారతీయ విద్యార్థులు.. చదువు కోసం విదేశాలకు ప్రయాణించారు. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ వెల్లడించారు.,6ఏళ్లల్లో 30 లక్షల మంది..హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2017లో 4,54,009 మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. 2018లో ఆ సంఖ్య 5,17,998కి.. 2019లో 5,86,337కి చేరింది. కొవిడ్ కారణంగా 2020లో ఆ సంఖ్య 2,59,655కి పడిపోయింది. అయితే.. 2021లో 4,44,553మంది భారతీయులు విదేశాలకు వెళ్లారు. అంటే.. 2021తో పోల్చుకుంటే 2022లో చదువు కోసం విదేశాలకు వెళ్లిన భారతీయుల సంఖ్య 68శాతం పెరిగింది. మొత్తం మీద 2017- 2022 మధ్య కాలంలో ఏకంగా 30లక్షలమంది భారతీయ విద్యార్థులు చదువుల కోసం విదేశీ విమానాలు ఎక్కారు.,ఇండియాలో అంతర్జాతీయ వర్సిటీలు..!Indian students in USA : ఇండియాలోని ఎడ్జ్యుకేషన్ బడ్జెట్ కన్నా.. విదేశాల్లో విద్య కోసం భారతీయులు చేస్తున్న ఖర్చే ఎక్కువగా ఉందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఇండియాలో భారీ ప్రమాణాలతో అంతర్జాతీయ వర్సిటీని ఏర్పాటు చేసే ప్రణాళికలు కేంద్రానికి ఏమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నకు సుభాష్ సర్కార్ సానుకూలంగా స్పందించలేదు. ప్రస్తుతానికైతే అలాంటి ప్లాన్స్ ఏవీ లేవని స్పష్టం చేశారు. అయితే.. అంతర్జాతీయ వర్సిటీలు ఇండియాకు వచ్చే విధంగా పలు నిబంధనలను డ్రాఫ్ట్ చేసినట్టు ఆయన వెల్లడించారు.,Funds for foreign education : విదేశీ విద్యకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే సొంతంగా నిధులు సమకూర్చుకోవడం ఎలా అన్నది ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.,"అంతర్జాతీయ విద్యా వ్యవస్థలు ఇండియాలో ఏర్పాటు అయ్యే విధంగా వర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఓ డ్రాఫ్ట్‌ను రూపొందించింది. సవరణలు, ఆమోదం కోసం బహిరంగ వేదికల్లో ఈ ముసాయిదాను పెట్టాము. ఫిబ్రవర 20లోపు వీటిపై స్పందించాల్సిందిగా కోరాము. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాము," అని సుభాష్ సర్కార్ స్పష్టం చేశారు.,‘యువత అంత విదేశాలకు వెళ్లిపోతోంది..’Indian students studying abroad statistics 2022 : ఇండియాలో చదువును వదిలేసి.. భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లిపోతుండటంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. యువత అంత విదేశాలకు వెళ్లిపోతోందన్నారు. అంతర్జాతీయ విద్యార్థులు.. చదువుల కోసం ఇండియాకు వచ్చే విధంగా దేశ విద్యా వ్యవస్థలో మార్పులు జరగాలని డిమాండ్ చేశారు.,