Father rapes daughter : కూతురిపై అఘాయిత్యం.. నాలుగు నెలలుగా ప్రతి రోజు రాత్రి..
11 July 2022, 18:51 IST
Father rapes daughter : రోజు రాత్రి ఇంటికి తాగి వెళతాడు ఆ వ్యక్తి. కన్న కూతురు అని కూడా చూడకుండా.. నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ ఘటన రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది.
కూతురిపై అఘాయిత్యం.. నాలుగు నెలలుగా ప్రతి రోజు రాత్రి..
Father rapes daughter : రాజస్థాన్లో మానవ జాతి తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. 15ఏళ్ల కూతురిపై నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ కిరాతక తండ్రి.
రాత్రి పూట.. తాగొచ్చి..
బారాన్ జిల్లాలోని అట్రు ప్రాంతంలో ఓ 31ఏళ్ల వ్యక్తి నివాసముంటున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. మొదటి భార్య మరణంతో రెండో పెళ్లి చేసుకున్నాడు.
కానీ ఆ వ్యక్తికి తాగడం అలవాటు. రోజు రాత్రి తాగొచ్చి ఇంట్లో రచ్చ రచ్చ చేస్తాడు. ఇది తట్టుకోలేక.. రెండో భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఆ తర్వాత.. పెద్ద కూతురిపై అతని కళ్లు పడ్డాయి!
Rajasthan crime news : నాలుగు నెలలుగా రోజు రాత్రి మద్యం తాగొచ్చి.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు ఆ కిరాతకుడు. ఆమె నరకం అనుభవిస్తూనే ఉంది.
ఎట్టకేలకు.. ధైర్యం తెచ్చుకుని స్నేహితురాలితో కలిసి శనివారం రాత్రి అట్రు పోలీస్ స్టేషన్కు వెళ్లింది. తనకు జరిగినది పోలీసులకు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే నిందితుడుని అరెస్ట్ చేశారు.
బాధితురాలు ఐదో తరగతి వరకే చదువుకుంది. మొదటి భార్య మరణం అనంతరం ఆమెను చదువు మానిపించేశాడు ఆ తండ్రి.