Man rapes daughter | క‌న్న కూతురుపైనే అత్యాచారం.. రాజ‌స్తాన్‌లో రాక్ష‌సుడు-man arrested for allegedly raping daughter in rajasthan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Man Arrested For Allegedly Raping Daughter In Rajasthan

Man rapes daughter | క‌న్న కూతురుపైనే అత్యాచారం.. రాజ‌స్తాన్‌లో రాక్ష‌సుడు

HT Telugu Desk HT Telugu
Jul 09, 2022 08:20 PM IST

రాజ‌స్తాన్‌లో ఒక రాక్ష‌సుడు సొంత కూతురిపైనే అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. ప్రేమాభిమానాలు, వావివ‌రుస‌లు మ‌ర్చిపోయి, సొంత బిడ్డ‌నే బెదిరించి అత్యాచారం చేశాడు.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ఆ రాక్ష‌సుడి దారుణం వెల్ల‌డ‌వ‌డంతో పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి, కేసు పెట్టారు. బాలిక‌ను త‌ల్లి త‌ర‌ఫు బంధువుల‌కు అప్ప‌గించారు.

Man rapes daughter | రాజ‌స్తాన్‌లో దారుణం

ఈ దారుణం రాజ‌స్తాన్‌లోని హ‌నుమాన్‌గ‌ఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలిక త‌ల్లి కొన్నేళ్ల క్రితం చ‌నిపోయింది.అప్ప‌టి నుంచి, చంపేస్తాన‌ని బెదిరించి, ఆ బాలిక‌పై తండ్రి అత్యాచారం చేయ‌డం ప్రారంభించాడు. ఎవ‌రికైనా చెప్పినా చంపేస్తాన‌ని బెదిరించాడు. ఎవ‌రి ఇంటికీ పంపించ‌కుండా, ఇంట్లోనే ఆ బాలిక‌ను ఉంచేవాడు. ఇలా ఏడాదిన్న‌ర పాటు ఈ అఘాయిత్యం కొన‌సాగించాడు. ఇటీవ‌ల వారి ఇంటికి మేన‌మామ‌, అమ్మ‌మ్మ వ‌చ్చారు. వారికి ఆ బాలిక ఏడుస్తూ.. తండ్రి చేస్తున్న అఘాయిత్యాన్ని వివ‌రించింది.

Man rapes daughter | పోలీసు కేసు

దాంతో వెంట‌నే ఆ బాలిక మేన‌మామ ఆమెను ప‌ల్లు పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అత‌డిపై ఐపీసీ, పొక్సొ చ‌ట్టాల కింద కేసు న‌మోదు చేశారు.

IPL_Entry_Point