తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fake Caste Certificate Case Of Mp Navneet Rana: ఎంపీ, నటి నవనీత్ రాణాకు ఊరట

Fake caste certificate case of MP Navneet Rana: ఎంపీ, నటి నవనీత్ రాణాకు ఊరట

HT Telugu Desk HT Telugu

15 November 2022, 21:24 IST

google News
  • Fake caste certificate case of MP Navneet Rana: పార్లమెంటు సభ్యురాలు, నటి నవనీత్ రాణాకు నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో ఊరట లభించింది.

భర్త, ఎమ్మెల్యే రవి రాణాతో కలిసి కోర్టుకు హాజరైన నవనీత్ రాణా
భర్త, ఎమ్మెల్యే రవి రాణాతో కలిసి కోర్టుకు హాజరైన నవనీత్ రాణా (HT PHOTO)

భర్త, ఎమ్మెల్యే రవి రాణాతో కలిసి కోర్టుకు హాజరైన నవనీత్ రాణా

Fake caste certificate case of MP Navneet Rana: మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ గా ఉన్న నవనీత్ రాణాతో పాటు ఆమె తండ్రిపై నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ కేసుకు సంబంధించి స్థానిక కోర్టు నవంబర్ 7న నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

Fake caste certificate case of MP Navneet Rana: ప్రత్యేక కోర్టులో ఊరట

నా నాన్ బెయిలబుల్ వారంటు పై నవనీత్ రాణా ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాన్ని కోర్టుకు వెల్లడించారు. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నవంబర్ 19 వరకు ఆమెపై, ఆమె తండ్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు తమ స్పందన తెలియజేసేవరకు వారంటును అమలు చేయబోమని ప్రాసిక్యూషన్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాంతో, ప్రాసిక్యూషన్ నుంచి నవంబర్ 19 లోపు స్పందన కోరుతూ, ఆ లోపు నవనీత్ రాణా, ఆమె తండ్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆర్ ఎన్ రోకడే ఆదేశించారు.

Fake caste certificate case of MP Navneet Rana: కేసు ఏంటి?

మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం. అక్కడ నుంచి పోటీ చేయడం కోసం తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందుతానని పేర్కొంటూ నవనీత్ రాణా నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ ను అందించారని ములుంద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ నకిలీ సర్టిఫికెట్ ను పొందడం కోసం నవనీత్ రాణా, ఆమె తండ్రి కొన్ని డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ చెల్లదని పేర్కొంటూ 2021లో బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివాహం చేసుకోవడానికి ముందు నవనీత్ రాణా పలు తెలుగు సినిమాల్లో నవనీత్ కౌర్ పేరుతో నటించారు.

తదుపరి వ్యాసం