తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Excise Case: సిసోడియాకు షాక్; రిమాండ్ పొడిగించిన కోర్టు

Excise Case: సిసోడియాకు షాక్; రిమాండ్ పొడిగించిన కోర్టు

HT Telugu Desk HT Telugu

04 March 2023, 19:37 IST

google News
  • Manish Sisodia's CBI remand: లిక్కర్ స్కామ్ (liquor scam) కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన ఢిల్లీ ఉఫ ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు వాయిదా వేసింది.

కోర్టు వద్ద ఆప్ నేత మనీశ్ సిసోడియా
కోర్టు వద్ద ఆప్ నేత మనీశ్ సిసోడియా (HT_PRINT)

కోర్టు వద్ద ఆప్ నేత మనీశ్ సిసోడియా

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (delhi excise policy)లో అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సీబీఐ (CBI) అరెస్ట్ చేసిన ఢిల్లీ ఉఫ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) ను శనివారం మరోసారి రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరుపర్చారు. సీబీఐ అభ్యర్థన మేరకు, సిసోడియా రిమాండ్ ను మరో రెండు రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది.

Manish Sisodia news: బెయిల్ విచారణ వాయిదా

అలాగే, మనీశ్ సిసోడియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను కూడా కోర్టు వాయిదా వేసింది. మార్చి 10వ తేదీన మనీశ్ సిసోడియా (Manish Sisodia) బెయిల్ పిటిషన్ ను విచారిస్తామని వెల్లడించింది. మనీశ్ సిసోడియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై స్పందించాలని ఆదేశిస్తూ రౌజ్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

CBI on Manish Sisodia: సహకరించడం లేదు..

ఢిల్లీ ఉఫ ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా రిమాండ్ ను పొడగించాలని కోర్టును అభ్యర్థిస్తూ, సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసు విచారణలో మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఏ మాత్రం సహకరించడం లేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరో ఇద్దరు నిందితుల ఎదురుగా మనీశ్ సిసోడియాను ప్రశ్నించాల్సి ఉందని, అందువల్ల తమకు మరో రెండు రోజుల కస్టడీ అవసరమని కోర్టుకు విన్నవించారు. మనీశ్ సిసోడియా (Manish Sisodia) తరఫున సీనియర్ న్యాయవాదులు దయాన్ కృష్ణన్,మోహిత్ మాథుర్ హాజరయ్యారు. రిమాండ్ ను పొడగించడం వల్ల ఉపయోగం లేదని, ఇప్పటికే తన క్లయింట్ సిసోడియా ఇల్లు, ఆఫీస్ ల్లో తనిఖీలు చేశారని, కానీ ఎలాంటి సాక్ష్యాధారాలను సాధించలేకపోయారని దయాన్ కృష్ణన్ వాదించారు. ఇప్పుడ కస్టడీని పొడగించడం వల్ల ఏ డాక్యుమెంట్లను వారు సాధించగలరని ప్రశ్నించారు. సిసోడియా భార్య ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రిమాండ్ పొడగించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని మోహిత్ మాథుర్ కోర్టును కోరారు.

Sisodia complains on CBI: అడిగిందే అడుగుతున్నారు..

కోర్టు విచారణకు శనివారం ఢిల్లీ ఉఫ ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా కూడా హాజరయ్యారు. సీబీఐ అధికారులు తనతో మర్యాదపూర్వకంగానే వ్యవహరిస్తున్నారని, ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లేదని కోర్టుకు తెలిపారు. అయితే, తనను 9 నుంచి 10 గంటల పాటు విచారణ గదిలో కూర్చోబెడుతున్నారని, అడిగిన ప్రశ్నలనే పదేపదే అడుగుతున్నారని కోర్టుకు Manish Sisodia ఫిర్యాదు చేశారు. అలా పదేపదే ఒకే ప్రశ్నను అడగడం మానసికంగా వేధించడమేనని అన్నారు. దానికి ఒకే ప్రశ్నను పలుమార్లు అడగవద్దని కోర్టు సీబీఐ కి సూచించింది.

తదుపరి వ్యాసం