తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Electoral Bonds Case: సుప్రీంకోర్టుకు ఎస్బీఐ వెల్లడించిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవే..

Electoral Bonds Case: సుప్రీంకోర్టుకు ఎస్బీఐ వెల్లడించిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవే..

HT Telugu Desk HT Telugu

13 March 2024, 13:21 IST

    • Electoral Bonds Case: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ వద్ద కొనుగోలు చేసిన, రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎస్బీఐ వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

Electoral Bonds Case: వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్ కేసులో మార్చి 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం కంప్లయన్స్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 వరకు కొనుగోలు చేసిన, రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ తన అఫిడవిట్లో పంచుకుంది.

ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు..

ఎస్బీఐ దాఖలు చేసిన కంప్లయన్స్ అఫిడవిట్ ప్రకారం..

  • 2019 ఏప్రిల్ 1 నుంచి 2019 ఏప్రిల్ 11 మధ్య మొత్తం 3,346 ఎలక్టోరల్ బాండ్లను (Electoral Bonds) కొనుగోలు చేశారు.
  • 2019 ఏప్రిల్ 12 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్య మొత్తం 18,871 ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా, 20,421 ఎలక్టోరల్ బాండ్లను రీడీమ్ చేశారు.
  • మొత్తంగా 22,217 ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశామని, 22,030 ఎలక్టోరల్ బాండ్లను రీడీమ్ చేశామని ఎస్బీఐ బుధవారం అఫిడవిట్లో తెలిపింది.

తదుపరి వ్యాసం