తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రూ. 2.50కే వేడివేడి సమోసాలు.. 'తాతా నువ్వు సూపర్​'

రూ. 2.50కే వేడివేడి సమోసాలు.. 'తాతా నువ్వు సూపర్​'

HT Telugu Desk HT Telugu

28 February 2022, 17:03 IST

google News
    • ఈ కాలంలో 3 రూపాయలకు ఏం వస్తాయి? అని ఆలోచిస్తే.. చాలా తక్కువ వస్తువులే గుర్తొస్తాయి. ఇదే విషయాన్ని భోజన ప్రియులు ఆలోచిస్తే?.. చాక్లెట్లు తప్ప ఏం రావనే జవాబు లభిస్తుంది. అలాంటిది.. రూ. 2.50కే వేడివేడి సమోసాలు దొరికితే? వినడానికే యమ్మీగా ఉంది కదూ! ఓ వృద్ధుడు రూ. 2.50కే సమోసాలు అమ్ముతున్నాడు.
రూ. 2.50కే వేడివేడి సమోసాలు
రూ. 2.50కే వేడివేడి సమోసాలు

రూ. 2.50కే వేడివేడి సమోసాలు

సమోసాలంటే ఇష్టం లేని వారంటూ బహుశా ఎవరు ఉండకపోవచ్చు! చిన్నదైనా, పెద్దదైనా.. సమోసా క్రేవింగ్స్​ వస్తే వెంటనే ఆరగించాల్సిందే. ఒకప్పుడు 5,6 రూపాయలకే పెద్ద సమోసాలు వస్తే.. ఇప్పుడు ఆ ధరకు చిన్నవి కూడా రావడం లేదు. సమోసా ప్రియులకు ఎక్కువ డబ్బులు పెట్టడం తప్పడం లేదు. అయితే పంజాబ్​లోని ఓ వృద్ధుడు మాత్రం.. తన కొట్టులో సమోసాలను ఇప్పటికీ రూ. 2.50కే అమ్ముతున్నాడు. ఈ వార్త విన్న ప్రజలు వావ్​ అంటున్నారు.

అమృత్​సర్​లో మహాన సింగ్​ రోడ్డులో ఆ 75ఏళ్ల వృద్ధుడికి ఓ చిన్న దుకాణం ఉంది. అందులోనే వేడివేడి సమోసాలు అమ్మతూ జీవితాన్ని సాగిస్తున్నాడు. ఆ సమాసాలు ఎంతో రుచిగా ఉండటంతో అక్కడి స్థానికులు వాటిని ఆరగించేందుకు ఎగబడుతున్నారు. రూ. 2.50కే లభిస్తుండటంతో ఇంకా సంతోషపడిపోతున్నారు.

ఆ వృద్ధుడు సమోసాలు తయారు చేసి అమ్ముతున్న దృశ్యాలను సరబ్​జీత్​ సింగ్​ అనే ఓ ఫుడ్​ బ్లాగర్​.. వీడియో తీసి తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశాడు. ఫిబ్రవరి 7న పోస్ట్​ చేయగా.. ఇప్పటికి ఆ వీడియోకు 8లక్షలకుపైగా వ్యూస్​ రావడం విశేషం. నెటిజన్లు సైతం ఆ పోస్ట్​పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'తాతా నువ్వు సూపర్​..' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 'ఈ కాలంలో కూడా రూ. 2.50కే సమోసాలు అమ్ముతున్నారంటే.. చాలా గొప్ప విషయమే' అంటున్నారు.

సంబంధిత కథనం

తదుపరి వ్యాసం