తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samosa Recipe | రుచికరమైన సమోసా రిసెపీ

Samosa recipe | రుచికరమైన సమోసా రిసెపీ

Manda Vikas HT Telugu

28 February 2022, 18:53 IST

google News
    • కొద్దిగా ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా చిరుతిండి తినాలనిపిస్తుంది. అందులో సమోసాను తినడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఇంటికి ఎవరైనా ఊహించని అతిథులు వచ్చినపుడు కూడా కప్ 'టీ' తో పాటు సమోసా ఇవ్వడం ఒక మంచి ఛాయిస్ అవుతుంది. రుచికరంగా, పంజాబీ స్టైల్లో సమోసాను ఎలా తయారు చేయాలో రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం
Samosa Recipe
Samosa Recipe (Stock Photo)

Samosa Recipe

బ్రేక్ సమయంలో లేదా కొద్దిగా ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా చిరుతిండి తినాలనిపిస్తుంది. అందులో సమోసాను తినడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినపుడు కూడా కప్ 'టీ' తో పాటు సమోసా ఇవ్వడం మంచి ఛాయిస్ గా చెప్పవచ్చు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఎప్పుడైనా సరే వెంటనే సమోసాను సిద్ధం చేయవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచికరంగా, పంజాబీ స్టైల్లో సమోసాను ఎలా తయారు చేయాలో రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం, ఇది చూసి నేర్చుకుని ఈ వారాంతంలో సమోసా చేయడం ఒకసారి ప్రయత్నించి చూడండి.

సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు

• ½ కిలో బంగాళాదుంపలు (ఉడకబెట్టి, తోలు తీసి తరిగినవి)

• ½ kg శుద్ధి చేసిన పిండి (మైదా)

• ½ కప్పు నూనె లేదా నెయ్యి

• 5 గ్రాముల అజ్వైన్ (ఓమ/వాము)

• రుచికి తగినట్లుగా ఉప్పు

• 1 tsp జీలకర్ర

• 1/2 tsp పసుపు పొడి

• ¼ tsp ఎర్ర మిరప పొడి

• 2-3 పచ్చి మిరపకాయలు

• 2 tsp అల్లం

• 1 నిమ్మ

• కొత్తిమీర ఆకులు

• 1/3 కప్పు పచ్చి బఠానీలు

• 2 tsp చాట్ మసాలా పొడి

• 1 tsp ఫెన్నెల్ సీడ్స్

• 1/2 tsp గరం మసాలా

• 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు

• డీప్ ఫ్రైయింగ్ కోసం సరిపడా నూనె

తయారుచేసే విధానం:

తొలుత అల్లం, పచ్చి మిరపకాయలు కొద్దిగా కొత్తిమీరను సన్నగా తరుగుకోవాలి. అనంతరం మైదా పిండి, వాము 1/2 కప్పు నూనె లేదా నెయ్యితో బాగా కలుపుకొని ముద్దగా చేసుకోవాలి. దీనికి కొద్దిగా నీటిని చిలకరించి పిండి ముద్దను మరింత సాగేటట్లుగా చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఈ పిండి ముద్దను సమోసా సైజుకు వీలుగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఉంచుకోవాలి.

రెండో దశలో పోపు కోసం కొద్దిగా నూనె లేదా నెయ్యిని వేడిచేసుకొని అందులో మొదటగా జీలకర్ర వేసుకోవాలి వేగిన తర్వాత అల్లం వేసుకొని కలపాలి. ఆపై మిగతా అన్ని పదార్థాలను వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా ఉడికించి, కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేయించాలి. ఈ తర్వాత పెనం నుంచి కిందకు దించి, కొద్దిగా నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు, చిన్నచిన్న భాగాలుగా చేసుకున్న పిండి ముద్దలను సెమీసర్కిల్ లో కట్ చేసుకొని సమోసా మాదిరి త్రికోణపు ఆకారాన్ని ఇవ్వాలి. అందులో ఆలూ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని అంచులకు కొద్దిగా నీటిని అద్దుతూ మూసివేయాలి. వీటిని మరుగుతున్న నూనెలో బంగారు గోధుమ వర్ణం వచ్చేంతవరకు వేయించాలి. అనంతరం ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి.

టాపిక్

తదుపరి వ్యాసం