తెలుగు న్యూస్  /  National International  /  Ed Files First Charge Sheet Against Manish Sisodia, Names Him 'Main Accused'

Liquor scam: ‘‘లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు మనీశ్ సిసోడియానే’’: ఈడీ

HT Telugu Desk HT Telugu

04 May 2023, 20:33 IST

  • Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor scam) గా పేరుగాంచిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate ED) తొలి చార్జిషీట్ ను గురువారం ఫైల్ చేసింది.

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా

Liquor scam: లిక్కర్ స్కామ్ (Liquor scam) లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate ED) తొలి చార్జిషీట్ ను గురువారం ఫైల్ చేసింది. నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం (Prevention of Money Laundering Act PMLA) కింద మనీశ్ సిసోడియాపై పలు అభియోగాలను ఈడీ నమోదు చేసింది.

ED charge sheet in Liquor scam: ప్రధాన నిందితుడు సిసోడియానే..

ఈ మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు మనీశ్ సిసోడియా (Manish Sisodia) నే అని ఈడీ ఆ చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొంది. ఇదే కేసులో నిందితుడుగా పేర్కొంటూ మనీశ్ సిసోడియాను మొదట ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తరువాత ఈడీ కూడా ఆయనను అదుపులోకి తీసుకుంది.ప్రస్తుతం ఆయన జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్టయ్యారు. మరోవైపు, సిసోడియా (Manish Sisodia) పై సీబీఐ కూడా గత నెలలో అవినీతి, నేరపూరిత కుట్ర ఆరోపణలపై కేసు నమోదు చేసింది. సౌత్ గ్రూప్ గా పేరున్న లిక్కర్ లాబీ నుంచి లంచంగా వచ్చిన రూ. 100 కోట్ల అవినీతి సొమ్ములో అధిక భాగం ఆప్ (AAP) కు వెళ్లిందని ఈడీ ఆరోపించింది. ఆ మొత్తాన్ని 2022 లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆప్ వాడుకుందని వెల్లడించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన వెనుక అప్పుడు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియా (Manish Sisodia) దే కీలక పాత్ర అని ఈడీ విశ్వసిస్తోంది. విమర్శలు రావడంతో 2021 -22 ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ఆ తరువాత రద్దు చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ ఐదు చార్జిషీట్లను ఫైల్ చేసింది.