Budget session 2022 | రాజ్యసభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మల
31 January 2022, 15:46 IST
- Budget 2022 | కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. 2021-22 ఆర్థిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.
రాజ్యసభలో నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman budget news | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజులో భాగంగా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. రాజ్యసభలో 2021-22 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఆంగ్లం, హిందీ భాషల్లో సర్వే పత్రాలను సర్వేను సభ ముందుకు తీసుకొచ్చారు.
సభ వాయిదా..
సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు రాజ్యసభ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇటీవల మరణించిన ఎంపీలు, నేతలకు.. పెద్దల సభ సభ్యులు నివాళులర్పించి, కొంతసేపు మౌనం పాటించారు.
ఆ తర్వాత.. ఆర్థిక సర్వేతో పాటు స్టాటిస్టికల్ అపెండిక్స్ను సభలో ప్రవేశపెట్టారు నిర్మల. అనంతరం పెద్దల సభ.. మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.
లోక్సభలో..
Economic Survey 2022 | అంతకుముందు.. నిర్మలా సీతారామన్.. ఆర్థిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో జీడీపీ వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతంగా ఉండొచ్చని ఈ సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.9 శాతం వృద్ధి సాధించినట్లు సర్వే స్పష్టం చేసింది. ఇది గతేడాది 3.6 శాతంగా ఉంది.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం కేంద్ర బడ్జెట్ను ఉభయసభల ముందుకు తీసుకురానున్నారు ఆర్థికమంత్రి.