Gas Cylinder expiry date : గ్యాస్ సిలిండర్‌కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది! ఇలా చెక్ చేసుకోండి..
13 November 2023, 11:58 IST
- Gas Cylinder expiry date : గ్యాస్ సిలిండర్‌కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా? ఇలా చెక్ చేసుకోండి.
గ్యాస్ సిలిండర్‌కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది!
Gas Cylinder expiry date in Telugu : చాలా వస్తువులను.. ఎక్స్పైరీ డేట్ చూసే కొంటాము. కానీ కొన్ని వస్తువుల విషయంలో దానిని పట్టించుకోము. ఏళ్ల తరబడి వాడేస్తూ ఉంటాము. లేదా ఆ వస్తువు పనైపోయేంత వరకు వినియోగిస్తుంటాము. వీటిల్లో గ్యాస్ సిలిండర్ ఒకటి. కానీ.. గ్యాస్ సిలిండర్‌కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా? నమ్మలేకపోతున్నారా! ఇది నిజం. మనం వంటకు వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌కి కూడా ఎక్స్పైరీ అనేది ఉంటుంది. దానిని ఎలా తెలుసుకోవాలి? అనే విషయంపై రూపొందించిన ఓ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇలా చెక్ చేసుకోండి..
వైరల్ వీడియోలో.. గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ గురించి ఓ వ్యక్తి స్పష్టంగా వివరించాడు. సిలిండర్‌ని పట్టుకునే భాగానికి లోపల.. కొన్ని పదాలు, నెంబర్లు రాసి ఉంటాయి. వాటిని డీకోడ్ చేసి మనం సిలిండర్ ఎక్స్పైరీ డేట్‌ని తెలుసుకోవచ్చు.
How to check Gas Cylinder expiry date : ఒక ఉదాహరణతో దీనిని మనం అర్థం చేసుకుందాము. సిలిండర్ మీద “ఏ-26” అని రాసి ఉందనుకుందాము. ఏ అనేది సిలిండర్ ఎక్స్పైరీ అవుతున్న నెలకు సంబంధించింది. 26 అనేది ఏ ఏడాదిలో ఎక్స్పైర్ అవుతుంది? అన్న విషయాన్ని చెబుతుంది.
- ఏ అంటే జనవరి నుంచి మార్చ్ వరకు.
- బీ అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు.
- సీ అంటే జులై నుంచి సెప్టెంబర్ వరకు
- డీ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు.
ఒకవేళ "సీ-27" అని సిలిండర్ మీద రాసి ఉంటే.. ఆ గ్యాస్ సిలిండర్.. 2027 జులై- సెప్టెంబర్ మధ్యలో ఎక్స్పైర్ అవుతుంది. ఈ విధంగా.. ఒక సిలిండర్‌ని కొనే ముందు.. దాని ఎక్స్పైరీ డేట్‌ని చూసుకోవచ్చు.
Gas Cylinder expiry date : చాలా మందికి.. ఒక సిలిండర్‌నే ఎక్కువ సంవత్సరాలు వాడి అలవాటు ఉంటుంది. గ్యాస్ అయిపోతే.. ఆ సిలిండర్‌లోనే రీఫిల్ చేసుకుంటారు. కొన్ని నెలల పాటు ఇలా చేస్తే ఓకే కానీ.. ఏళ్ల తరబడి ఇదే ఫాలో అయితే.. సిలిండర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత.. లీకేజ్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే సిలిండర్ ఎక్స్పైరీ డేట్‌ని తెలుసుకోవాలి.