తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Swallows Coins : 39 కాయిన్లు, 37 మ్యాగ్నెట్స్​ మింగేసిన వ్యక్తి.. బాడీ బిల్డింగ్​కి 'జింక్​' కోసం..

Man Swallows coins : 39 కాయిన్లు, 37 మ్యాగ్నెట్స్​ మింగేసిన వ్యక్తి.. బాడీ బిల్డింగ్​కి 'జింక్​' కోసం..

Sharath Chitturi HT Telugu

27 February 2024, 7:20 IST

    • Delhi viral news : బాడీ బిల్డింగ్​కి జింక్​ అవసరమని తెలుసుకున్న ఓ వ్యక్తి.. 39 కాయిన్లు, 37 మ్యాగ్నెట్స్​ని మింగేశాడు! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
39 కాయిన్లు, 37 మ్యాగ్నెట్స్​ మింగేసిన వ్యక్తి.. బాడీ బిల్డింగ్​కి 'జింక్​' కోసం..
39 కాయిన్లు, 37 మ్యాగ్నెట్స్​ మింగేసిన వ్యక్తి.. బాడీ బిల్డింగ్​కి 'జింక్​' కోసం..

39 కాయిన్లు, 37 మ్యాగ్నెట్స్​ మింగేసిన వ్యక్తి.. బాడీ బిల్డింగ్​కి 'జింక్​' కోసం..

Delhi man Swallows coins : దిల్లీలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! బాడీ బిల్డింగ్ కోసం​ జింక్​ అవసరమని.. ఓ వ్యక్తి.. 39 కాయిన్లు, 37 మ్యాగ్నెట్స్​ మింగేసి ఆసుపత్రి పాలయ్యాడు!

ఇదీ జరిగింది..

దిల్లీకి చెందిన 26 ఏళ్ల వ్యక్తికి 20 రోజులుగా వాంతులు అవుతున్నాయి. ఏం తినలేకపోతున్నాడు. చివరికి.. కొన్ని రోజుల క్రితం సర్​ గంగా రామ్​ హాస్పిటల్​లో చేరాడు. ఔట్​పేషెంట్​ డిపార్ట్​మెంట్​లో అతడిని మొదట డా. తరుణన్​ మిట్టల్​ పరిశీలించారు. అతనికి కాయిన్లు, మ్యాగ్నెట్స్​ తినే అలవాటు ఉందని, ఆ వ్యక్తి బంధువులు డాక్టర్​కి చెప్పారు. అంతేకాకుండా.. ఆ 26ఏళ్ల వ్యక్తి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని, సైకియాట్రిక్​ ట్రీట్​మెంట్​ పొందుతున్నట్టు వివరించారు.

అనంతరం.. ఆ వ్యక్తి కడుపును ఎక్స్​-రే తీయించారు. కడుపులో చాలా కాయిన్లు, మ్యాగ్నెట్స్​ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. సీటీ స్కాన్​ తీయించగా.. కాయిన్లు, మ్యాగ్నెట్లు.. ప్రేగ వద్దకు చేరాయిని, అక్కడ అడ్డుగా మారాయని తేలింది. రోగికి వెంటనే సర్జరీ చేశారు.

Man eats coins in Delhi : సర్జరీ చేస్తుండగా.. కొన్ని కాయిన్లు.. ప్రేగులోకి దూరిపోయి, లూప్స్​గా మారిపోయాయని తేలింది. మ్యాగ్నెట్స్​ ఉండటంతో.. కాయిన్లు రెండు లూప్​లుగా ఏర్పడ్డాయి. కాయిన్లు, మ్యాగ్నెట్స్​ని చాలా జాగ్రత్తగా తొలగించారు వైద్యులు.

అనంతరం.. కడుపులోని కాయిన్లు, మ్యాగ్నెట్స్​ని కూడా తొలగించేందుకు సర్జరీ చేశారు. మొత్తం.. దిల్లీ వ్యక్తి కడుపులో నుంచి 39 కాయిన్లు (రూ.1, రూ. 2, రూ. 5), 37 మ్యాగ్నెట్​లు (వివిధ ఆకారాల్లోవి) బయటకు వచ్చాయి.

Man swallows magnets : ఆ తర్వాత.. రోగికి మళ్లీ ఎక్స్​-రే తీయించారు. అతని కడుపు, ప్రేగులో కాయిన్స్​, మ్యాగ్నెట్స్​ లేవని స్పష్టమైంది. 7 రోజుల తర్వాత.. ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యాడు.

అయితే.. 'అసలు ఎందుకు కాయిన్లు, మ్యాగ్నెట్స్​ మింగేశావు?' అని వైద్యులు అడిగన ప్రశ్నకు.. ఆ వ్యక్తి షాకింగ్​ జవాబు ఇచ్చాడు! 'బాడీ బిల్డింగ్​ కోసం జింక్​ అవసరం అని చెప్పారు. అందుకే కాయిన్లు, మ్యాగ్నెట్స్​ తీసుకున్నాను,' అని అన్నాడు.

Zinc for body building : కాయిన్లలో జింక్​ ఉంది. అవి ప్రేగులోకి వెళ్లాలని, ఆ వ్యక్తి కావాలనే మ్యాగ్నెట్స్​ మింగేశాడు. ఫలితంగా.. ప్రేగు జింక్​ని అబ్సార్బ్​ చేసుకుంటుందని భావించాడు!

ఈ వార్త ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. బాడీ బిల్డింగ్​కోసం 39 కాయిన్లు మింగేసిన వ్యక్తి కథను విని అందరు షాక్​ అవుతున్నారు.

తదుపరి వ్యాసం