Intestinal Worms Remedies : కడుపులో పురుగులుంటే.. అమ్మమ్మ చెప్పిన టిప్స్‌తో ఉపయోగం-get rid of intestinal worms in stomach with grand mother ayurvedic medicine style ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Get Rid Of Intestinal Worms In Stomach With Grand Mother Ayurvedic Medicine Style

Intestinal Worms Remedies : కడుపులో పురుగులుంటే.. అమ్మమ్మ చెప్పిన టిప్స్‌తో ఉపయోగం

Anand Sai HT Telugu
Feb 26, 2024 09:30 AM IST

Intestinal Worms Treatment : నులిపురుగుల మీద ఎంత అవగాహన కల్పించినా చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఇవి కడుపులో ఉంటే మాత్రం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. వీటిని వదిలించుకోవాలి.

కడుపులో పురుగులకు చిట్కాలు
కడుపులో పురుగులకు చిట్కాలు (Unsplash)

Stomach Worms Remedies : నులిపురుగు అనేది పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. మన కడుపులో ఉండే ఈ పురుగులు మనల్ని ఇబ్బంది పెడతాయి. నులి పురుగులు అనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు ఈ వ్యాధి కారకాన్ని అస్కారియాసిస్ అని పిలుస్తారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. థ్రెడ్‌వార్మ్‌లు, రౌండ్‌వార్మ్‌లు, విప్‌వార్మ్‌లు, గియార్డియా, హుక్‌వార్మ్‌లు, టేప్‌వార్మ్‌లు మొదలైనవి కనిపిస్తాయి.

నులిపురుగులుంటే కనిపించే లక్షణాలు

నోటి దుర్వాసన, అతిసారం, రింగ్‌వార్మ్, నిద్రలేని రాత్రులు, చెడు కలలు, తరచుగా ఆకలి దప్పులు, తలనొప్పి, రక్తహీనత వంటి లక్షణాలు నులి పురుగుల వనల కనిపిస్తాయి. ఈ పేగు పురుగులను చంపేందుకు 6 నెలలకు ఒకసారి మాత్రలు వేసుకుంటారు. ఇది కాకుండా ఈ పురుగులను వదిలించుకోవడానికి అనేక సహజ పద్ధతులను కూడా ఉన్నాయి. మన అమ్మమ్మల కాలం నాటి పద్ధతులను పాటిస్తే సరిపోతుంది. మనం రోజూ తీసుకునే ఆహారంలో పాలకూర, బొప్పాయి పండు, అవకాడో, ఓము, దాల్చిన చెక్క, పసుపు మొదలైన వాటిని తీసుకుంటే పేగు పురుగులు పూర్తిగా నశిస్తాయి.

ఎలా ప్రవేశిస్తాయంటే..

ఈ పురుగులు మనం తాగే నీరు, తినే ఆహారం ద్వారా లోపలకు ప్రవేశిస్తాయి. మనం చేతులు శుభ్రం చేసుకోకుండా తిన్నప్పుడు పురుగులు మన పేగుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. హుక్‌వార్మ్‌లు అనేవి నీటిలో నివసిస్తాయి, మన చర్మం ద్వారా ప్రవేశిస్తాయి. ఈగలు సోకిన ఆహారాన్ని తినడం, కుక్కలను తాకడం, ఉడికించని కూరగాయలు వంటి తీసుకుంటే టేప్‌వార్మ్‌లను శరీరంలోకి వస్తాయి.

మనం పాటించే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా ఈ పురుగులకు కారణమవుతాయి. ఈ పురుగులు నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి మన పేగులకు చేరి లార్వాగా పొదుగుతాయి. ఈ పురుగులు మనం తినే ఆహారంలోని అన్ని పోషకాలను గ్రహించి, పోషకాహార లోపం, కడుపు సంబంధిత సమస్యలను కలిగించే అవకాశాలు ఉన్నాయి.

ఇవి తినకండి

క్రీమ్, నూనె, వెన్న వంటి ఆహారాలను పూర్తిగా మానేయాలి. వేడి నీటిని తీసుకుంటే పేగుల్లోని మలినాలు బయటకు వెళ్లి పేగులు శుభ్రపడతాయి.

ఇలా నులిపురుగులు వదిలించుకోండి

పేగు పురుగులను వదిలించుకోవడానికి ముందుగా 6 రోజుల పాటు పండ్లు మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, పాలు, తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి.

రెండు వెల్లుల్లి రెబ్బలను బూట్లలో, చెప్పుల కింద వేసుకుని నడవండి. మీరు నడుస్తున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు చూర్ణం అవుతాయి. రసం మీ చర్మం గుండా మీ రక్తప్రవాహంలోకి వెళుతుంది. పేగు పురుగులను చంపడానికి సరిపోతుంది.

అల్పాహారంలో 1 టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరిని చేర్చండి. కొన్ని గంటల తర్వాత గంటల తర్వాత దీపం నూనె తాగండి. ఈసారి పేగు పురుగులు చచ్చిపోతాయి.

థ్రెడ్‌వార్మ్‌లను వదిలించుకోవడానికి క్యారెట్ ఒక అద్భుతమైన రెమెడీ. ప్రతిరోజూ ఉదయం ఒక చిన్న కప్పు క్యారెట్‌ను తీసుకోండి. ఆ తర్వాత ఏమీ తినకూడదు. ఇది పురుగులను త్వరగా బయటకు పంపుతుంది.

1 టేబుల్ స్పూన్ తేనె, బొప్పాయి రసాన్ని 4 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇలా రెండు రోజులు పాటించాలి.

టేప్‌వార్మ్‌లను వదిలించుకోవడానికి గుమ్మడికాయ గింజలను విస్తృతంగా ఉపయోగిస్తారు. దీని ఎండిన గింజలను పొడి చేసి మరిగించి దాని రసాన్ని ఖాళీ కడుపుతో తాగాలి. మళ్లీ మరుసటి రోజు తీసుకోండి. ఇలా చేస్తే పేగు పురుగుల సమస్య నుంచి బయటపడొచ్చు.

నులిపురుగులను వదిలించుకునేందుకు మార్కెట్లో మందులు ఉన్నాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం కూడా ఈ కడుపులోని పురుగులను వదిలించుకోవచ్చు. అయితే ఎలాంటి కొత్త పద్ధతి పాటించినా నిపుణుల సలహా తీసుకోండి.