జట్టు పెరుగుదల కోసం జింక్ పుష్కలంగా ఉండే 5 రకాల ఆహారాలు ఇవే
Photo: Unsplash
By Chatakonda Krishna Prakash Sep 30, 2023
Hindustan Times Telugu
జుట్టు (వెంట్రుకలు) పెరుగుదలకు జింక్ కీలకంగా ఉంటుంది. అందుకే జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, చుండ్రు తగ్గాలన్నా జింక్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇలా జింక్ ఎక్కువగా ఉండే కొన్ని ఆహారాలు ఇవే.
Photo: Unsplash
పాలకూరలో జింక్ పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సీ కూడా ఉంటాయి. దీంతో పాలకూర తింటే జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. వెంట్రుకలు రాలడాన్ని నియంత్రిస్తుంది.
Photo: Unsplash
సెనగలు, అలసందలు, కందిపప్పు లాంటి కాయధాన్యాల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. బయోటిన్, విటమిన్ సీ, ఐరన్, మెగ్నేషియమ్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మీ స్కాల్ప్ కు పోషకాలు అందుతాయి. కొలేజన్ ఉత్పత్తి పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తాయి.
Photo: Unsplash
యగర్ట్‌లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది కూడా జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.
Photo: Unsplash
గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇవి తీసుకుంటే శరీరంలో కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతుంది. జుట్టు పెరుగుదలకు ఇది కీలకంగా ఉంటుంది.
Photo: Unsplash
బాదంపప్పు, జీడిపప్పు లాంటి నట్స్ తిన్నా శరీరానికి జింక్ బాగా అందుతుంది. దీంతో ఇవి తింటే జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.