తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dawood Ibrahim : దావూద్​ ఇబ్రహీంపై విష ప్రయోగం! కరాచీ​లో హై సెక్యూరిటీ మధ్య చికిత్స!

Dawood Ibrahim : దావూద్​ ఇబ్రహీంపై విష ప్రయోగం! కరాచీ​లో హై సెక్యూరిటీ మధ్య చికిత్స!

Sharath Chitturi HT Telugu

18 December 2023, 12:00 IST

google News
    • Dawood Ibrahim news : దావూద్​ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతను పాకిస్థాన్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం.
దావూద్​ ఇబ్రహీంపై హత్యాయత్నం!
దావూద్​ ఇబ్రహీంపై హత్యాయత్నం!

దావూద్​ ఇబ్రహీంపై హత్యాయత్నం!

Dawood Ibrahim news : అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతను.. పాకిస్థాన్​ కరాచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. సోషల్​ మీడియాలో ఈ వార్త వైరల్​గా మారింది. కానీ.. ఈ విషయంపై పాకిస్థాన్​ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

విష ప్రయోగంతో ఆసుపత్రిలో దావూద్​..!

1993 ముంబై దాడుల సూత్రధారి, ఇండియా మోస్ట్​ వాంటెడ్​ క్రిమినల్​ దావూద్​ ఇబ్రహీం.. రెండు రోజులుగా కరాచీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. హై సెక్యూరిటీ మధ్య అతనికి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. అతను ఉంటున్న ఫ్లోర్​లోకి ఎవరినీ అనుమతించట్లేదట. అక్కడ ఉన్న ఇతర రోగులను వేరే ఫ్లోర్​కి తరలించేశారని సమాచారం. టాప్​ అఫీషియల్స్​తో పాటు దావూద్​ కుటుంబసభ్యులకు మాత్రమే ఆ ఫ్లోర్​కి యాక్సెస్​ లభిస్తోందని వార్తలు వస్తున్నాయి.

Dawood Ibrahim hospitalized : దావూద్​ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందని, అతను ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడని వస్తున్న వార్తలను ధ్రువీకరించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని సేకరించేందుకు అతని బంధువులతో మాట్లాడేందుకు కృషి చేస్తున్నారు.

దావూద్​ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్​ను ఎన్​ఐఏ జనవరిలో విచారించింది. అండర్​ వరల్డ్​ డాన్​.. రెండో పెళ్లి తర్వాత, కరాచీలో స్థిరపడినట్టు ఆమె వెల్లడించింది. కరాచీ విమానాశ్రయాన్ని దావూద్​, అతని సహచరులు కంట్రోల్​ చేస్తున్నారని ఎన్​ఐఏ, తన ఛార్జ్​షీట్​లో పేర్కొంది.

Dawood Ibrahim poisoned : ఎన్ని ఆధారాలున్నా.. పాకిస్థాన్​ మాత్రం.. దావూద్​ తమ దేశంలో లేడని వాదిస్తోంది. ఇక ఇప్పుడు.. కరాచీలోని ఆసుపత్రిలో హై సెక్యూరిటీ మధ్య అతనికి చికిత్స లభిస్తోందన్న వార్తలపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలి.

అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం..

భారత పోలీసులు ప్రకారం.. దావూద్​ ఇబ్రహీం, అతని డీ-కంపెనీ.. ముంబైలో ఇంకా నేర కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ముంబైలో.. డ్రగ్స్​, ఆయుధాల ట్రాఫికంగ్​, నకిలీ నోట్ల రవాణా వంటివి ఇంకా సాగిస్తున్నాడు దావూద్​. అల్​-ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో అతనికి బలమైన లింక్​లు ఉన్నాయి.

Dawood Ibrahim latest news : 1993 ముంబై దాడులను దేశం ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది. వరుస పేలుళ్లతో భారీ నష్టాన్నే చూసింది ముంబై. దావూద్​ ఇబ్రహీం సూత్రధారిగా ఉన్న ఈ దాడుల్లో.. 250మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1000కిపైగా మంది గాయపడ్డారు.

తదుపరి వ్యాసం