తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia-ukraine Crisis | ఉక్రెయిన్‌ ప్రభుత్వం, బ్యాంకుల వెబ్‌సైట్లపై సైబర్‌ దాడి

Russia-Ukraine Crisis | ఉక్రెయిన్‌ ప్రభుత్వం, బ్యాంకుల వెబ్‌సైట్లపై సైబర్‌ దాడి

Hari Prasad S HT Telugu

16 February 2022, 6:30 IST

    • ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయబోతోందన్న వార్తల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం, బ్యాంకుల వెబ్‌సైట్లపై సైబర్‌ దాడి జరిగింది. కనీసం పది వెబ్‌సైట్లు పని చేయలేదని ఉక్రెయిన్‌ ప్రభుత్వం వెల్లడించింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వద్దంటూ ఇటలీలోని రోమ్ లో ప్రదర్శన
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వద్దంటూ ఇటలీలోని రోమ్ లో ప్రదర్శన (REUTERS)

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వద్దంటూ ఇటలీలోని రోమ్ లో ప్రదర్శన

కీవ్‌: ఉక్రెయిన్‌పై నేరుగా యుద్ధానికి సిద్ధమై ప్రపంచ దేశాల వ్యతిరేకతతో వెనక్కి తగ్గుతున్న రష్యా.. ఆ దేశంపై మరోసారి సైబర్‌ దాడికి దిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉక్రెయిన్‌ ప్రభుత్వం, అక్కడి రెండు జాతీయ బ్యాంకులు వెబ్‌సైట్లు పని చేయలేదు. 

ట్రెండింగ్ వార్తలు

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

ఇది సైబర్‌ దాడే అని ఉక్రెయిన్‌ మంత్రి విక్టర్‌ జోరా స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ రక్షణ, విదేశాంగ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల వెబ్‌సైట్లతోపాటు అక్కడి రెండు పెద్ద జాతీయ బ్యాంకులు.. Privatbank, Sberbankల వెబ్‌సైట్లు కూడా పని చేయలేదు. ఆన్‌లైన్ పేమెంట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తాయని ఈ బ్యాంకుల కస్టమర్లు ఫిర్యాదు చేశారు. 

తమ బలగాలు ఉక్రెయిన్‌ సరిహద్దు నుంచి వెనక్కి వస్తున్నట్లు రష్యా చెప్పిన రోజే ఈ సైబర్‌ దాడి జరగడం గమనార్హం. ఈ దాడి వెనుక రష్యా హస్తం ఉన్నదని ఉక్రెయిన్‌ ఒక ప్రకటనలో అనుమానం వ్యక్తం చేసింది. యుద్ధం ఆలోచన బెడిసికొడుతుండటంతో రష్యా ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఆరోపించింది. 

జనవరిలోనూ 70 వరకూ ఉక్రెయిన్‌ ప్రభుత్వ వెబ్‌సైట్లు పని చేయని సందర్భంలో రష్యాపైనే ఆ దేశం అనుమానాలు వ్యక్తం చేసింది. 2017లోనూ NotPetya వైరస్‌తో ఉక్రెయిన్‌పై సైబర్‌ దాడి చేసిన రష్యా.. 1000 కోట్ల డాలర్ల నష్టాన్ని మిగిల్చింది.