తెలుగు న్యూస్  /  National International  /  Cuet Ug 2023 Admit Card Out For June 5 To 8 Exam, Download Link Here

CUET UG 2023 Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోండి ఇలా..

HT Telugu Desk HT Telugu

03 June 2023, 14:23 IST

    • దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG) అడ్మిట్ కార్డ్స్ సిద్ధమయ్యాయి. విద్యార్థులు వాటిని అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in. నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జూన్ 5వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు జరిగే సీయూఈటీ యూజీ 2023 (CUET UG 2023) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ను ఆ పరీక్షను నిర్వహిస్తున్న ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)’ సిద్ధం చేసింది. ఆ అడ్మిట్ కార్డ్స్ ను విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in. నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Crime news : 8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

జూన్ 5 నుంచి జరిగే పరీక్షలకే..

ఈ అడ్మిట్ కార్డ్స్ జూన్ 5, జూన్ 6, జూన్ 7, జూన్ 8 తేదీల్లో నిర్వహించే సీయూఈటీ యూజీ పరీక్షలకు మాత్రమే సంబంధించినవి. ఆయా రోజుల్లో ఈ పరీక్షను రాస్తున్న విద్యార్థులు మాత్రమే తమ అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన రోజు వివరాల ద్వారా cuet.samarth.ac.in. వెబ్ సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ ఇలా చేసుకోవాలి..

  • సీయూఈటీ యూజీ అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపిస్తున్న CUET UG 2023 Admit Card లింక్ పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ వివరాలు ఫిల్ చేసి, సబ్మిట్ నొక్కాలి.
  • స్క్రీన్ పై మీ అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.
  • అందులోని వివరాలను సరి చూసుకుని, అనంతరం డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.
  • అడ్మిట్ కార్డ్ ను ప్రింట్ తీసుకోవాలి.
  • విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొంటే వారు 011 - 40759000 / 011 - 69227700 నంబర్లపై అధికారులను సంప్రదించి, సహకారం తీసుకోవచ్చు. లేదా cuet-ug@nta.ac.in. కు మెయిల్ చేయవచ్చు.
  • Direct link to download CUET UG 2023 Admit Card