CUET UG 2023 postponed : ఈ ప్రాంతాల్లో సీయూఈటీ యూజీ పరీక్ష వాయిదా.. అభ్యర్థులకు అలర్ట్​!-cuetug 2023 postponed in j k manipur new dates announced ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Cuet-ug 2023 Postponed In J&k, Manipur; New Dates Announced

CUET UG 2023 postponed : ఈ ప్రాంతాల్లో సీయూఈటీ యూజీ పరీక్ష వాయిదా.. అభ్యర్థులకు అలర్ట్​!

Sharath Chitturi HT Telugu
May 20, 2023 08:43 AM IST

CUET UG 2023 postponed : కొన్ని ప్రాంతాల్లో సీయూఈటీ యూజీ 2023 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఎన్​టీఏ వెల్లడించింది. పూర్తి వివరాలు..

ఈ ప్రాంతాల్లో సీయూఈటీ యూజీ పరీక్ష వాయిదా.. అభ్యర్థులకు అలర్ట్​!
ఈ ప్రాంతాల్లో సీయూఈటీ యూజీ పరీక్ష వాయిదా.. అభ్యర్థులకు అలర్ట్​!

CUET UG 2023 postponed : సీయూఈటీ యూజీ (కామన్​ యూనివర్సిటీ ఎంట్రెన్స్​ టెస్ట్​ ఫర్​ అండర్​గ్రాడ్జ్యూయేట్​) పరీక్షలపై కీలక అప్డేట్​ ఇచ్చింది ఎన్​టీఏ. మణిపూర్​, జమ్ముకశ్మీర్​లలో ఈ నెల 21 నుంచి జూన్​ 6 వరకు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. ఆయా తేదీలకు బదులుగా మే 29, 26 తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

మణిపూర్​లో కొన్ని రోజుల క్రితం హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పరిస్థితులు ఇప్పుడు శాంతించినా.. సాధారణ స్థితికి రాలేదు. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. మరోవైపు.. జమ్ముకశ్మీర్​లో విద్యార్థుల సౌకర్యం కోసం తాత్కాలిక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో, అందుకు సమయం పడుతుందని భావించి పరీక్షను వాయిదా వేసింది ఎన్​టీఏ.

CUET UG 2023 Manipur : కాగా.. 2020 ఎన్​పీఏలో భాగంగా ఇతర ప్రాంతాల్లో మే 21 నుంచి జూన్​ 6 వరకు సీయూఈటీ యూజీ 2023 పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఎన్​టీఏ స్పష్టం చేసింది.

"మణిపూర్​ యంత్రాంగాన్ని సంప్రదించిన తర్వాత.. పరీక్షలను ఈ నెల 29 నుంచి ప్రారంభించాలని నిర్ణయించాము," అని ఎన్​టీఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దఫా పరీక్షల కోసం మణిపూర్​ నుంచి 3,697 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వివరించింది.

సీయూఈటీ యూజీ అడ్మిట్​ కార్డులు..

CUET UG 2023 admit card download online : 2023 సీయూఈటీ యూజీ అడ్మిట్​ కార్డులను విడుదల చేసింది ఎన్​టీఏ. అభ్యర్థులు తమ అడ్మిట్​ కార్డులను cuet.samarth.ac.in లో డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన అడ్మిట్​ కార్డులను ఎన్​టీఏ తాజాగా విడుదల చేసింది.

అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

స్టెప్​ 1:- సీయూఈటీ యూజీ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోం పేజ్​లో ఉన్న సీయూఈటీ యూజీ అడ్మిట్​ కార్డ్​ 2023 లింక్​పై క్లిక్​ చేయండి.

CUET UG Admit Card download : స్టెప్​ 3:- మీ లాగిన్​ వివరాలు ఇచ్చి.. సబ్మీట్​ బటన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 4:- మీ అడ్మిట్​ కార్డు స్క్రీన్​పై కనిపిస్తుంది.

స్టెప్​ 5:- మీ అడ్మిట్​ కార్డును చెక్​ చేసుకుని డౌన్​లోడ్​ చేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం