CUET PG 2024: సీయూఈటీ పీజీ కి దరఖాస్తు చేసుకునే గడువును మరోసారి పొడిగించిన ఎన్టీఏ
09 February 2024, 17:39 IST
- CUET PG 2024: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వ విద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే సీయూఈటీ పీజీ 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరోసారి పొడిగించింది.
ప్రతీకాత్మక చిత్రం
CUET PG 2024 Last date extended: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ 2024 (CUET PG 2024) కు దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరోసారి పొడిగించింది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు సీయూఈటీ పీజీ 2024 కు ఫిబ్రవరి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో..
ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు సీయూఈటీ పీజీ 2024 కు ఎన్టీఏ సీయూఈటీ అధికారిక వెబ్సైట్ pgcuet.samarth.ac.in ద్వారా ఆన్ లైన్ లో ఫిబ్రవరి 10వ తేదీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు తుది లావాదేవీ ఫిబ్రవరి 10, 2024 రాత్రి 11.50 గంటల వరకు చేయవచ్చు. కరెక్షన్ విండో ఫిబ్రవరి 13, 2024 వరకు యాక్టివ్ గా ఉంటుంది.
మార్చి 11 నుంచి పరీక్షలు
సీయూఈటీ పీజీ 2024 ప్రవేశ పరీక్ష మార్చి 11 నుంచి 28 వరకు జరుగుతుంది. త్వరలోనే ఎన్టీఏ పూర్తి షెడ్యూల్ ను విడుద చేయనుంది. పరీక్ష వ్యవధి 1.45 గంటలు ఉంటుంది. సీయూఈటీ పీజీ 2024 ప్రవేశ పరీక్షలను మూడు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. సీయూఈటీ పీజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఏప్రిల్ 4న విడుదల చేయనున్నారు.
CUET PG 2024 registration: ఇలా అప్లై చేయాలి
సీయూఈటీ పీజీ 2024 (CUET PG 2024) కు అప్లై చేయాలనుకునే విద్యార్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవుతూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
- ముందుగా CUET PG అధికారిక వెబ్ సైట్ pgcuet.samarth.ac.in ను ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీయూఈటీ పీజీ 2024 రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
- రిజిస్టర్ చేసుకోండి. ఆ తరువాత, రిజిస్టర్ చేసుకున్న అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి.
- అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.
- మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీయూఈటీ పీజీ అధికారిక వెబ్సైట్ pgcuet.samarth.ac.in ను పరిశీలించండి.