తెలుగు న్యూస్  /  National International  /  Cuet Pg 2023 Registration Date To Be Extended, Says Ugc Chairman

CUET PG 2023: సీయూఈటీ - పీజీ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ పొడగింపు

HT Telugu Desk HT Telugu

18 April 2023, 22:26 IST

  • CUET PG 2023: ఈ సంవత్సరం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేషన్ (CUET PG) కి రిజిస్ట్రేషన్ కు లాస్ట్ డేట్ ను పొడిగిస్తున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు.

యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్
యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్

యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్

CUET PG 2023: ఈ సంవత్సరం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేషన్ (CUET PG) కి రిజిస్ట్రేషన్ కు లాస్ట్ డేట్ ను పొడిగిస్తున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ (UGC Chief Jagadesh Kumar) వెల్లడించారు. ఈ విషయాన్ని CUET PG ని నిర్వహించే ఎన్టీఏ (NTA) త్వరలో అధికారికంగా ప్రకటిస్తుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

CUET PG 2023 registration: మే 5 వరకు అవకాశం

ఈ సంవత్సరం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేషన్ (CUET PG) కి దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు మే నెల 5 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పిస్తున్నామని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ (UGC Chief Jagadesh Kumar) వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన తరువాత CUET PG పరిధిలోకి మరిన్ని యూనివర్సిటీలు వచ్చిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులు CUET PG కి మే 5, రాత్రి 9.50 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. విద్యార్థులు ఈ CUET PG పరీక్షకు ఆన్ లైన్ లో cuet.nta.nic.in. వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో తప్పొప్పులను సరిచేసుకునేందుకు వీలు కల్పించే కరెక్షన్ విండో మే 6వ తేదీ నుంచి మే 8 వ తేదీ వరకు cuet.nta.nic.in. వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.

CUET PG 2023: కొత్త వర్సిటీలు రావడం వల్ల..

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన తరువాత CUET PG పరిధిలోకి మరిన్ని యూనివర్సిటీలు వచ్చిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ (UGC Chief Jagadesh Kumar) వెల్లడించారు. విద్యార్థులు ఆయా యూనివర్సిటీలకు సంబంధించిన కోర్సులను కూడా ఎంపిక చేసుకోవడానికి ఇప్పుడు వీలువుతుందన్నారు. ఇప్పటికే అప్లై చేసుకున్న విద్యార్థులు కూడా మరోసారి తమకు నచ్చిన వర్సిటీని, నచ్చిన కోర్సును యాడ్ చేసుకోవడానికి మే 5వ తేదీ వరకు అవకాశం లభిస్తుంది. అయితే, యాడ్ చేసుకున్న ప్రతీ సబ్జెక్టుకు విద్యార్థి అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఇప్పటికే అప్లై చేసుకున్న విద్యార్థి తను అప్లై చేసుకున్న కోర్సుల్లో ఏవైనా కోర్సులను తొలగించుకోవాలనుకుంటే, ఆ అవకాశం కూడా కల్పిస్తున్నారు. అయితే, ఇప్పటికే చెల్లించిన ఫీజు ను రీఫండ్ చేయరన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.