CUET-PG examination dates: సీయూఈటీ - పీజీ పరీక్ష తేదీలు ఇవే..-cuetpg examination dates released by nta check here the details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet-pg Examination Dates: సీయూఈటీ - పీజీ పరీక్ష తేదీలు ఇవే..

CUET-PG examination dates: సీయూఈటీ - పీజీ పరీక్ష తేదీలు ఇవే..

HT Telugu Desk HT Telugu
Dec 29, 2022 06:54 PM IST

CUET-PG examination dates: సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ అడ్మిషన్ల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ తేదీలను ఎన్ టీ ఏ (NTA) ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT)

CUET-PG examination dates: దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (Common University Entrance Test CUET-PG) తేదీలను National Testing Agency (NTA) ప్రకటించింది.

CUET-PG examination dates: జూన్ 1 నుంచి..

సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే CUET-PG ని 2023 సంవత్సరం జూన్ లో చేపట్టాలని NTA నిర్ణయించింది. జూన్ 1వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ 2023 మార్చి నెల రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ CUET-PG లో సాధించే మార్కుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (University Grants Commission UGC) చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. CUET-PG ప్రశ్న పత్రాల విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. విద్యార్థులు జనరల్ టెస్ట్ తో పాటు, గరిష్టంగా ఆరు డొమైన్ సబ్జెక్టుల్లో, ఒకటి లేదా రెండు లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో ఈ అడ్మిషన్ టెస్ట్ రావచ్చు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ సహా పలు ప్రాంతీయ బాషల్లో ఈ పరీక్ష ఉంటుంది.

CUET-UG details: యూజీ కోర్సులకు?

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే సీయూఈటీ యూజీ (CUET-UG) ని మే నెల 21 నుంచి 31 వరకు నిర్వహించాలని, జూన్ మూడో వారం లోపు ఫలితాలను ప్రకటించాలని ఇప్పటికే నిర్ణయించారు. జులై నెల లోపు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ముగించాలని భావిస్తున్నారు. అలాగే, ఆయా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో తరగతుల నిర్వహణ ఆగస్ట్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.

Whats_app_banner