CUET 2023: CUET 2023 కి దరఖాస్తు చేసుకునే తేదీలివే..-cuet 2023 registration process to commence in february s first week ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Cuet 2023: Registration Process To Commence In February's First Week

CUET 2023: CUET 2023 కి దరఖాస్తు చేసుకునే తేదీలివే..

HT Telugu Desk HT Telugu
Dec 16, 2022 04:50 PM IST

CUET UG 2023: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి అవసరమైన ప్రవేశ పరీక్ష సీయూఈటీ యూజీ (Common University Entrance Test UG (CUET - UG) దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలను శుక్రవారం యూజీసీ వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి అవసరమైన ప్రవేశ పరీక్ష సీయూఈటీ యూజీ (Common University Entrance Test UG (CUET - UG) దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(University Grants Commission UGC) చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు.

CUET registration process: ఆన్ లైన్ అప్లికేషన్, పరీక్ష తేదీలు

CUET - UG 2023 పరీక్షకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in. ద్వారా ఫిబ్రవరి తొలి వారం నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షను వచ్చే సంవత్సరం మే నెల 21 వ తేదీ నుంచి 31 వ తేదీ మధ్య నిర్వహిస్తారు. అలాగే, ఫలితాలను 2023, జూన్ మూడో వారంలో ప్రకటిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన CUET-PG పరీక్ష ఫలితాలను జులై తొలి వారంలో విడుదల చేస్తామని యూజీసీ చైర్మన్ తెలిపారు. అలాగే, జులై నెల చివరి వరకు ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా యూనివర్సిటీలు అడ్మిషన్ ప్రక్రియలను ముగిస్తాయని, క్లాసెస్ ఆగస్ట్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.

NTA conducts CUET: ఎన్ టీ ఏ నిర్వహణ

ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency NTA) నిర్వహిస్తుంది. విద్యార్థులు ఈ CUET పరీక్షల తాజా వివరాల కోసం ఎప్పటికప్పుడు ఎన్ టీ ఏ అధికారిక వెబ్ సైట్ www.nta.ac.in ను సందర్శించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ CUET (UG) పరీక్షను నిర్వహిస్తారు.

IPL_Entry_Point

టాపిక్