తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cisce Class 12 Results: సీఐఎస్​సీఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. 18మందికి టాప్​ ర్యాంక్​

CISCE class 12 results: సీఐఎస్​సీఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. 18మందికి టాప్​ ర్యాంక్​

Sharath Chitturi HT Telugu

24 July 2022, 18:09 IST

google News
  • CISCE class 12 results : సీఐఎస్​సీఈ 12వ తరగతి ఫలితాల్లో 18మందికి టాప్​ ర్యాంక్​ లభించింది. 99.52శాతం మంది పరీక్షల్లో పాస్​ అయ్యారు.

సీఐఎస్​సీఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
సీఐఎస్​సీఈ 12వ తరగతి ఫలితాలు విడుదల (HT_Print)

సీఐఎస్​సీఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

CISCE class 12 results : సీఐఎస్​సీఈ 12వ తరగతి ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ దఫా పరీక్షల్లో.. 18మంది విద్యార్థులు టాప్​ ర్యాంక్​ను పంచుకోవడం విశేషం. వారికి 99.75శాతం స్కోర్​ లభించింది.

రెండో ర్యాంక్​(99.50శాతం)ను 58మంది విద్యార్థులు పంచుకున్నారు. మరో 78మంది.. 99.25శాతంతో మూడో ర్యాంక్​ దక్కించుకున్నారు.

మొత్తం మీద.. సీఐఎస్​సీఈ 12వ తరగతి పరీక్షల్లో పాస్​ పర్సెంటేజ్​ 99.52గా ఉంది. బాలురులపై బాలికలు స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించారు.

సీఐఎస్​సీఈ 12వ తరగతి ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ దఫా పరీక్షల్లో.. 18మంది విద్యార్థులు టాప్​ ర్యాంక్​ను పంచుకోవడం విశేషం. వారికి 99.75శాతం స్కోర్​ లభించింది.

రెండో ర్యాంక్​(99.50శాతం)ను 58మంది విద్యార్థులు పంచుకున్నారు. మరో 78మంది.. 99.25శాతంతో మూడో ర్యాంక్​ దక్కించుకున్నారు.

మొత్తం మీద.. సీఐఎస్​సీఈ 12వ తరగతి పరీక్షల్లో పాస్​ పర్సెంటేజ్​ 99.52గా ఉంది. బాలురులపై బాలికలు స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించారు.

సీఐఎస్​సీఈ చరిత్రలోనే తొలిసారిగా.. బోర్డు పరీక్షలను రెండు దఫాలుగా జరిపింది.

ఇలా లెక్కించారు..

CISCE result 2022 : మొదటి సెమిస్టర్​ పరీక్షల ఫలితాలను సగం చేసి.. రెండో సెమిస్టర్​ పరీక్షల ఫలితాలకు జోడించారు. అయితే ఈ ప్రక్రియ నుంచి జామెట్రీ, మెకానికల్​ డ్రాయింగ్​, ఆర్ట్స్​ వంటి సబ్జెక్టులకు మినహాయింపునిచ్చారు.

ఇలా చెక్​ చేసుకోండి..

  • అఫీషియల్​ వెబ్​సైట్​ cisce.org - results.cisce.org కు వెళ్లండి.
  • హోంపేజ్​లోని ఐఎస్​సీ రిజల్ట్స్​ 2022 లింక్​ మీద క్లిక్​ చేయండి.
  • మీ యునీక్​ ఐడీ, ఇండెక్స్​ నెంబర్​తో పాటు ఇతర వివరాలను టైప్​ చేయండి.
  • స్క్రీన్​ మీద సీఐఎస్​సీఈ 12వ తరగతి ఫలితాలు వెలువడతాయి.
  • ప్రింటౌట్​ ఆప్షన్​కు అందుబాటులో ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం