ICAI CA Intermediate Results : ఐసీఏఐ సీఏ ఇంటర్మీడియట్ ఫలితాలు.. రిజల్ట్ లింక్ ఇదే
21 July 2022, 18:04 IST
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ 2022 ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాజన్ కాబ్రా అనే వ్యక్తి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు.
ప్రతీకాత్మక చిత్రం
చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంటర్మీడియట్ పరీక్ష మే 2022 సెషన్ ఫలితాలు తాజాగా విడుదల అయ్యాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా రిజల్ట్ ప్రకటించింది. ICAI CA ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు icai.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలను చూసుకునేందుకు అభ్యర్థులు తమ రోల్ నంబర్‌తో పాటు రిజిస్ట్రేషన్ నంబర్ లేదా పిన్ నంబర్‌ను సమర్పించాలి. ICAI CA ఇంటర్మీడియట్ 2022 పరీక్ష ఈ సంవత్సరం మే 14 నుండి 30 వరకు జరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రాజన్ కాబ్రా ఆల్ ఇండియా మెదటి ర్యాంక్ సాధించాడు. అతడికి 800కి గానూ.. 666 మార్కులు వచ్చాయి. గౌహతికి చెందిన నిష్ఠా బోత్రా, హర్ద్వానీకి చెందిన కునాల్ కమల్ వరుసగా రెండు, మూడో స్థానంలో నిలిచారు.
ఐసీఏఐ సీఏ ఇంటర్మీడియట్ పరీక్ష కోసం.. 2022లో మొత్తం 1,51,818 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 546 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. గ్రూప్ I పరీక్షల్లో దాదాపు 10,717 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా, గ్రూప్ 2లో 7,943 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండు గ్రూపుల్లో 1,337 మంది ఉత్తీర్ణులయ్యారు. Icai.nic.in, Icai.org , Icaiexam.icai.org, Caresults.icai.org వెబ్ సైట్లలో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ICAI CA Intermediate Result 2022 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..
- icai.nic.in లో ICAI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మే 2022 కోసం రిజల్ట్ లింక్‌ని సెర్చ్ చేసి క్లిక్ చేయండి.
- పోర్టల్‌లో ఆరు అంకెల రోల్ నంబర్ మరియు పిన్/రిజిస్ట్రేషన్ నంబర్‌ను సమర్పించాలి. ఆ తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
- CA ఇంటర్మీడియట్ ఫలితాలు మీ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- ఫలితాన్ని చూసుకని, ప్రింట్ అవుట్ తీసుకోండి.