తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chandrayaan 3: తొలిసారి విక్రం ల్యాండర్ ను ఫొటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్

Chandrayaan 3: తొలిసారి విక్రం ల్యాండర్ ను ఫొటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్

HT Telugu Desk HT Telugu

30 August 2023, 14:42 IST

google News
  • Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ తొలిసారి చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రం ల్యాండర్ ను ఫొటో తీసింది.

 ప్రజ్ఞాన్ రోవర్ తొలిసారి తీసిన విక్రం ల్యాండర్ ఫొటో
ప్రజ్ఞాన్ రోవర్ తొలిసారి తీసిన విక్రం ల్యాండర్ ఫొటో

ప్రజ్ఞాన్ రోవర్ తొలిసారి తీసిన విక్రం ల్యాండర్ ఫొటో

Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ తొలిసారి చంద్రుడి ఉపరితలంపై పార్క్ చేసి ఉన్న విక్రం ల్యాండర్ ను ఫొటో తీసింది. ఆ ఫొటోను ఇస్రో బుధవారం ట్విటర్ లో షేర్ చేసింది.

ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం

ఆగస్టు 23వ తేదీన విక్రం లాండర్ విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై దిగింది. ఆ తర్వాత, మూడు గంటల అనంతరం లాండర్ సైడ్ ప్యానల్ లో నుంచి ర్యాంప్ ద్వారా చంద్రుడి ఉపరితలం పైకి ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టింది. ఆరు చక్రాల ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడు ఉపరితలంపై తిరగడం ప్రారంభించింది. గత వారం రోజులుగా విక్రం ల్యాండర్ కు సమీపంలోనే తిరుగుతూ చంద్రుడి ఉపరితలాన్ని, వాతావరణాన్ని విశ్లేషిస్తుంది.

ఇస్రో లేటెస్ట్ అప్ డేట్..

చంద్రయాన్ 3 కి సంబంధించి మరో తాజా అప్డేట్ ను ఇస్రో బుధవారం షేర్ చేసింది. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ అక్కడ నిలిచి ఉన్న విక్రం ల్యాండర్ ను వివిధ కోణాల్లో ఫోటో తీసింది. ఆ ఫోటోలను ఇస్రో బుధవారం షేర్ చేసింది. ఆ ఫొటోల్లో విక్రం ల్యాండర్ నిలిచి ఉన్న దృశ్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజ్ఞాన్ రోవర్ లోని నావిగేషన్ కెమెరా ఈ ఫోటోలను తీసింది. బుధవారం ఉదయం 7:35 గంటలకు ఈ ఫోటోలను తీసినట్లు ఇస్రో వెల్లడించింది. ఆ ఫోటోలో విక్రమ్ ల్యాండర్ కు చెందిన రెండు పేలోడ్స్ ChaSTE, ILSA స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువం పై పార్క్ అయి ఉన్న విక్రమ్ ల్యాండర్ ఫోటోను ఇస్రో షేర్ చేయడం ఇదే మొదటిసారి. గత వారం ల్యాండర్ నుండి చంద్రుడి ఉపరితలంపైకి దిగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ ఫోటోలను, వీడియోను ఇస్రో షేర్ చేసింది. ఆ తరువాత చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ ఫోటోలను, వీడియోను షేర్ చేసింది కానీ చంద్రుడి ఉపరితలంపై నిలిచి ఉన్న విక్రం ల్యాండర్ ఫోటోను మాత్రం బుధవారం తొలిసారిగా ఇస్రో షేర్ చేసింది.

తదుపరి వ్యాసం