Chandrayaan 3: చంద్రయాన్ 3 మరో విజయం; చంద్రుడి పై ఆక్సిజన్, సల్ఫర్ ఇతర మూలకాలను గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్
Chandrayaan 3: చంద్రయాన్ 3 విజయ పరంపర కొనసాగుతోంది. చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా తన అన్వేషణ కొనసాగిస్తోంది. గతంలో ఎవరు కూడా గుర్తించని మూలకాలను ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan rover) గుర్తిస్తోంది.
Chandrayaan 3: చంద్రయాన్ 3 విజయ పరంపర కొనసాగుతోంది. చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా తన అన్వేషణ కొనసాగిస్తోంది. గతంలో ఎవరు కూడా గుర్తించని మూలకాలను ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan rover) గుర్తిస్తోంది.
చంద్రుడిపై ఆక్సిజన్ ఉంది..
ఆగస్ట్ 23న విజయవంతంగా చంద్రయాన్ 3 విక్రం ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువం సమీపంలో దిగింది. ఆ తరువాత ఆ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగి, ప్రయాణం ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలాన్ని, వాతావరణాన్ని విశ్లేషిస్తోంది. అందులో భాగంగానే తాజాగా చంద్రుడి ఉఫరితలంలో సల్ఫర్ మూలకాన్ని ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. చంద్రుడి పుట్టుకకు, ఆవాస యోగ్యతకు ఈ తాజా ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడనున్నాయి. ‘‘చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ మూలకం జాడలను నిర్దిష్టంగా, స్పష్టంగా ప్రజ్ఞాన్ రోవర్ పై ఉన్న లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) గుర్తించింది’’ అని ఇస్రో మంగళవారం ప్రకటించింది. అంతేకాదు, ఆక్సీజన్, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, అల్యూమినియం వంటి ఇతర మూలకాల జాడలను కూడా ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని ఇస్రో ప్రకటించింది. మరో వారం రోజుల పాటు ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ అక్కడి నేలను, వాతావరణాన్ని విశ్లేషించనుంది.