తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Panels For Social Media Takedowns: సోషల్ మీడియా పై ఫిర్యాదులకు ప్రత్యేక కమిటీలు

Panels for social media takedowns: సోషల్ మీడియా పై ఫిర్యాదులకు ప్రత్యేక కమిటీలు

HT Telugu Desk HT Telugu

28 January 2023, 15:03 IST

google News
  • Panels for social media takedowns: అభ్యంతరకర, అవమానకర కంటెంట్ పై చేసిన ఫిర్యాదులకు సోషల్ మీడియా (social media) ప్లాట్ ఫామ్స్ నుంచి సంతృప్తికర చర్యలు లేనట్లయితే, వాటిపై ఫిర్యాదు చేయడానికి మూడు ప్రత్యేక కమిటీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Representational Image)

ప్రతీకాత్మక చిత్రం

Panels for social media takedowns: సోషల్ మీడియా (social media) లో వచ్చిన అభ్యంతరకర కంటెంట్ పై యూజర్లు, లేక ఇతర వర్గాలు చేసిన ఫిర్యాదులపై ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నిర్ధారిత సమయంలోగా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం రూపొందించిన ఐటీ రూల్స్ (information and technology rules) లో స్పష్టంగా ఉంది. ఒకవేళ సోషల్ మీడియా (social media) ప్లాట్ ఫామ్స్ ఏ చర్యలు తీసుకోకపోయినా, తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేకపోయినా బాధితులు ఇప్పుడు ప్రభుత్వం నియమించిన కమిటీలను ఆశ్రయించవచ్చు.

Panels for social media takedowns: ఇమ్యూనిటీని కోల్పోతారు

ఐటీ రూల్స్ లో చేసిన సవరణ మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఇచ్చిన ఆదేశాలను ఆయా సోషల్ మీడియా (social media) ప్లాట్ ఫామ్స్ ఇంటర్మీడియరీలు కచ్చితంగా అమలు చేయాలని, ఒకవేళ అమలు చేయని పక్షంలో వాటికి ఐటీ రూల్స్ లోని సెక్షన్ 79 ప్రకారం లభించే ఇమ్యూనిటీని కోల్పోతాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా (social media) ప్లాట్ ఫామ్స్ నుంచి సరైన స్పందన లభించని పక్షంలో బాధితులు 30 రోజుల్లోగా ఈ కమిటీలను ఆశ్రయించాల్సి ఉంటుంది.

Panels for social media takedowns: ఏ కమిటీలో ఎవరు?

తొలి కమిటీలో హోం శాఖ లోని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్ పర్సన్ గా ఉంటారు. మాజీ ఐపీఎస్ అశుతోశ్ శుక్లా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సునీల్ సోనీ సభ్యులుగా ఉంటారు. వీరి పదవీకాలం మూడేళ్లు. రెండో కమిటీకి సమచార ప్రసార శాఖలో పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ డివిజన్ జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. రిటైర్డ్ కామడోర్ సునీల్ కుమార్ గుప్తా, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కవింద్ర శర్మ సభ్యులుగా ఉంటారు. మూడో కమిటీకి Electronics and Information Technology శాఖలో సైంటిస్ట్ గా పని చేస్తున్న కవిత భాటియా చైర్ పర్సన్ గా ఉంటారు. రిటైర్డ్ ఐఆర్ టీఎస్ అధికారి సంజీవ్ గోయల్, ఐడీబీఐ ఇన్ టెక్ లిమిటెడ్ మాజీ ఎండీ కృష్ణగిరి రఘోత్తమరావు మురళీ మోహన్ సభ్యులుగా ఉంటారు.

తదుపరి వ్యాసం