తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Centre Asks Rahul Gandhi To Stop Bharat Jodo Yatra: ‘భారత్ జోడో యాత్రను ఆపేయండి’

Centre asks Rahul Gandhi to stop Bharat Jodo Yatra: ‘భారత్ జోడో యాత్రను ఆపేయండి’

HT Telugu Desk HT Telugu

21 December 2022, 19:13 IST

  • Centre asks Rahul Gandhi to stop Bharat Jodo Yatra: చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పై కేంద్రం దృష్టి పెట్టింది. యాత్ర వల్ల కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

భారత్ జోడో యాత్రలో అభిమానులతో రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్రలో అభిమానులతో రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్రలో అభిమానులతో రాహుల్ గాంధీ

Centre asks Rahul Gandhi to stop Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర వరకు భారత్ జోడోయాత్ర(Bharat Jodo Yatra) పేరుతో దేశవ్యాప్త పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. యాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొంటున్నారు. యాత్ర విజయవంతం అవుతున్నందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

Centre asks Rahul Gandhi to stop Bharat Jodo Yatra: యాత్ర నిలిపేయండి..

అయితే, తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందువల్ల.. భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)లోనూ కొవిడ్ ప్రొటోకాల్ ను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొవిడ్ ప్రొటోకాల్ ను పాటించలేని పక్షంలో, ప్రజల ఆరోగ్యానికి ఎదురయ్యే ముప్పును పరిగణనలోకి తీసుకుని యాత్ర(Bharat Jodo Yatra)ను నిలిపి వేయాలని సూచించారు. చైనా, అమెరికా, బ్రెజిల్, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దాంతో, కరోనాను ఎదుర్కొనే సంసిద్ధతపై బుధవారం కేంద్రం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది.

Centre asks Rahul Gandhi to stop Bharat Jodo Yatra: నిబంధనలు పాటించాల్సిందే..

భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)లో రాహుల్ గాంధీతో పాటు, యాత్రలో పాల్గొంటున్న అందరూ కచ్చితంగా కొవిడ్ నిబంధనలను (Covid guidelines) పాటించాలని కేంద్రమంత్రి మాండవీయ స్పష్టం చేశారు. యాత్రలో పాల్గొనే అందరూ కచ్చితంగా నిబంధనల మేరకు కోవిడ్ టీకా వేసుకుని ఉండాలని ఆయన సూచించారు. అలాగే, అందరూ కచ్చితంగా మాస్క్ లు ధరించడం, సానిటైజర్లను వాడడం చేయాలన్నారు.

Centre asks Rahul Gandhi to stop Bharat Jodo Yatra: మోదీ పాటించారా?

కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించని పక్షంలో భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)ను నిలిపివేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన లేఖపై కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధరి స్పందించారు. ‘ప్రధాని మోదీ పాల్గొన్న గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో ఈ కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించారా?’ అని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. ‘భారత్ జోడో యాత్ర మీకు నచ్చలేదేమో కానీ.. దేశ ప్రజలు ఈ యాత్రను ఆదరిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని సూచించారు. భారత్ జోడో యాత్ర బుధవారం రాజస్తాన్ నుంచి హరియాణాలోకి ప్రవేశించింది.

తదుపరి వ్యాసం