XE variant | `ఎక్స్ఈ`విషయంలో భయపడాల్సిన అవసరం లేదు
11 April 2022, 20:46 IST
- కరోనా కొత్త వేరియంట్ `ఎక్స్ఈ` విషయంలో భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. ఎక్స్ఈ వేరియంట్‌ను తాజాగా మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో గుర్తించిన విషయం తెలిసిందే.
ప్రతీకాత్మక చిత్రం
`ఎక్స్ఈ`తో ఎలాంటి ముప్పు లేదని కేంద్రం తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో గుర్తించిన వేరియంట్ `ఎక్స్ఈ`నే అని నిర్ధారించడానికి మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుందని కోవిడ్ 19 వర్కింగ్ గ్రూప్ `నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్‌టీఏజీఐ) చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా వెల్లడించారు. కరోనాకు సంబంధించి కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయని, అయితే, వాటివల్ల ప్రాణాంతక సమస్యలు కానీ, కేసుల సంఖ్య భారీగా పెరగడం కానీ ఉండకపోవచ్చన్నారు.
ఇటీవల గుర్తించిన వేరియంట్ల తో కూడా వ్యాధి తీవ్ర త పెరగడం కానీ, కేసుల సంఖ్యలో పెరుగుదల కానీ లేని విషయాన్ని గుర్తించాలన్నారు. కొత్త వేరియంట్‌ను నిర్ధారించేందుకు కనీసం మూడు స్థాయిల్లో పరీక్షలు జరపాల్సి ఉంటుందని డాక్టర్ అరోరా వివరించారు. మహారాష్ట్ర, గుజరాత్‌లో గుర్తించిన వేరియంట్ ను నిశితంగా పరీక్షిస్తున్నామన్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో `ఎక్స్ ఈ`ని గుర్తించినట్లుగా చెబుతున్న ప్రాంతాల్లోనూ కొత్తగా నమోదవుతున్న కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం లేదన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు.
టాపిక్