తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Diwali Bonus: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్; కానీ అందరికీ కాదు..

Diwali bonus: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్; కానీ అందరికీ కాదు..

HT Telugu Desk HT Telugu

20 October 2023, 16:03 IST

google News
  • Diwali bonus: రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఈ రోజు మరో గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ఉద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Diwali bonus: పండుగ సీజన్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా లభించింది. కరువు భత్యాన్ని రెండు రోజుల క్రితమే 4% పెంచడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (DA) 42% నుంచి 46 శాతానికి పెరిగింది. ఇప్పుడు తాజాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగ బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

రూ. 7 వేల వరకు..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. దీపావళి బోనస్ గా ఒక నెల బేసిక్ సాలరీని, గరిష్టంగా రూ. 7 వేల వరకు, ఉద్యోగులు పొందుతారు. అయితే, ఈ బోనస్ కేంద్ర ప్రభుత్వ గ్రూప్ సీ ఉద్యోగులకు, గ్రూప్ బీ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు, కేంద్ర పారా మిలటరీ, సాయుధ దళాల్లోని అర్హులైన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ దీపావళి బోనస్ ను పొందడానికి ఉద్యోగులు మార్చి 31, 2023 నాటికి ఉద్యోగ విధుల్లో ఉండాలి. అలాగే, 2022 -23 ఆర్థిక సంవత్సరంలో కనీసం ఆరు నెలలు, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించి ఉండాలి. సాధారణంగా దీపావళి బోనస్ ను ప్రతీ సంవత్సరం, పర్ఫార్మెన్స్ తో సంబంధం లేకుండా అందిస్తుంటారు.

బేసిక్ సాలరీ పై..

దీపావళి బోనస్ ప్రొడక్టివిటీకి సంబంధం లేకుండా ఉంటుంది. బేసిక్ సాలరీ ఆధారంగా బోనస్ ను నిర్ధారిస్తారు. 30 రోజుల బేసిక్ సాలరీని దీపావళి బోనస్ గా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, ఆ నెలవారీ బేసిక్ వేతనం రూ. 7 వేల కన్నా ఎక్కువగా ఉన్నా.. రూ. 7 వేలు మాత్రమే బోనస్ గా ఇస్తారు. అంటే, గరిష్టంగా రూ. 7 వేల బోనస్ ఉద్యోగులకు లభిస్తుంది. రూ. 7 వేల కన్నా బేసిక్ వేతనం తక్కువగా ఉన్న ఉద్యోగులకు వారి నెలవారీ బేసిక్ సాలరీ ఎంత ఉంటే, అంత మొత్తం దీపావళి బోనస్ గా లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఈ బోనస్ కు అర్హులైన ఉద్యోగులు సుమారు 38 లక్షల మంది ఉన్నారు.

తదుపరి వ్యాసం