తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse: సీబీఎస్ఈ 9, 10 తరగతుల పరీక్షల్లో కీలక మార్పులు; కాంపిటెన్సీకి పెద్ద పీట

CBSE: సీబీఎస్ఈ 9, 10 తరగతుల పరీక్షల్లో కీలక మార్పులు; కాంపిటెన్సీకి పెద్ద పీట

HT Telugu Desk HT Telugu

07 April 2023, 15:29 IST

    • CBSE: 2023 - 24 విద్యా సంవత్సరం నుంచి 9 వ తరగతి ఫైనల్ పరీక్షల్లో, 10వ తరగతి బోర్డ్ పరీక్షల్లో కాంపిటెన్సీ బేస్డ్ ప్రశ్నల (competency based questions) వెయిటేజీని 50 శాతానికి పెంచనున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

competency based questions : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానంలో భాగంగా 2023 - 24 విద్యా సంవత్సరం నుంచి 9 వ తరగతి ఫైనల్ పరీక్షల్లో, 10వ తరగతి బోర్డ్ పరీక్షల్లో కాంపిటెన్సీ బేస్డ్ ప్రశ్నల (competency based questions) వెయిటేజీని 50 శాతానికి పెంచనున్నట్లు సీబీఎస్ఈ (Central Board of Secondary Education CBSE) వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

weightage to competency : షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ ప్రశ్నలకు తగ్గనున్న వెయిటేజీ

కాంపిటెన్సీ బేస్డ్ ప్రశ్నలకు (competency based questions) వెయిటేజీని పెంచడంతో పాటు షార్ట్ ఆన్సర్ (Short answer questions), లాంగ్ ఆన్సర్ (long answer questions) ప్రశ్నలకు వెయిటేజీని తగ్గించనున్నట్లు సీబీఎస్ఈ (Central Board of Secondary Education CBSE) వెల్లడించింది. సీబీఎస్ఈ 9, 10, 11, 12 తరగతుల ఎసెస్ మెంట్, ఎవాల్యుయేషన్ (assessment and evaluation) విధానంలో చేపట్టనున్న మార్పులను సీబీఎస్ఈ వెల్లడించింది. కొత్త విధానంలో 9వ తరగతి, 10వ తరగతి ల్లో కాంపిటెన్సీ బేస్డ్ ప్రశ్నల (competency based questions) కు వెయిటేజీని ప్రస్తుతం ఉన్న 40% నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది. సాధారణంగా కాంపిటెన్సీ బేస్డ్ ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (multiple choice questions MCQs), కేస్ బేస్డ్ క్వశ్చన్స్ (case based questions), సోర్స్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ క్వశ్చన్స్ (source based integrated questions) మొదలైనవి ఉంటాయి.

weightage to competency : 11వ తరగతి, 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో కూడా..

9వ తరగతి, 10 వ తరగతి ఫైనల్ పరీక్షల్లో ఈ కాంపిటెన్సీ బేస్డ్ ప్రశ్నలు కాకుండా, అదనంగా సెలెక్ట్ రెస్పాన్స్ టైప్ క్వశ్చన్స్ (select response type questions) 20% ఉంటాయని సీబీఎస్ఈ వెల్లడించింది. అలాగే, 9వ తరగతి, 10వ తరగతి ఫైనల్ పరీక్షల్లో షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ ప్రశ్నల వెయిటేజీని ప్రస్తుతం ఉన్న 40% నుంచి 30 శాతానికి తగ్గించనున్నట్లు తెలిపింది. 11వ తరగతి, 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో కాంపిటెన్స్ బేస్డ్ ప్రశ్నల (competency based questions) వెయిటేజీ ప్రస్తుతం ఉన్న 30% నుంచి 40 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. మొత్తం ప్రశ్నల్లో షార్ట్ ఆన్సర్ (Short answer questions), లాంగ్ ఆన్సర్ (long answer questions) ప్రశ్నల వెయిటేజీ గతంలో 50% ఉండగా, ఆ వెయిటేజీని 40 శాతానికి తగ్గిస్తున్నారు.