CBSE revaluation results: సీబీఎస్ఈ 10, 12 తరగతుల రీవాల్యుయేషన్ ఫలితాల వెల్లడి
13 June 2023, 13:56 IST
- సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి రీ వాల్యుయేషన్ లేదా రీ వెరిఫికేషన్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. మే 12న విడుదలైన 10, 12వ తరగతుల ఫలితాల అనంతరం, రీ వాల్యుయేషన్ లేదా రీ వెరిఫికేషన్ కు అప్లై చేసుకున్న విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ results.cbse.nic.in. లో ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి రీ వాల్యుయేషన్ (re-evaluation) లేదా రీ వెరిఫికేషన్ (re-verification) ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఇటీవల విడుదలైన 10వ తరగతి, 12వ తరగతి ఫలితాల అనంతరం, రీ వాల్యుయేషన్ లేదా రీ వెరిఫికేషన్ కు అప్లై చేసుకున్న విద్యార్థులు ఈ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్స్ results.cbse.nic.in. లో, లేదా cbseresults.nic.in లో ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు మే 12న విడుదల అయ్యాయి. ఈ సంవత్సరం కూడా బాలుర కన్నా బాలికలు ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. 10వ తరగతిలో బాలికల ఉత్తీర్ణతాశాతం 94.25% కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం బ. 12వ తరగతిలో బాలికల ఉత్తీర్ణతాశాతం 90.6% కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 84.67%.
చెక్ చేసుకోవడం ఎలా?
రీ వాల్యుయేషన్ లేదా రీ వెరిఫికేషన్ కు అప్లై చేసుకున్న విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్స్ results.cbse.nic.in. లో, లేదా cbseresults.nic.in లో తమ రోల్ నెంబర్, స్కూల్ నెంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీల ఆధారంగా కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవుతూ తమ రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా results.cbse.nic.in. లో, లేదా cbseresults.nic.in లేదా www.cbse.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీ పై కనిపించే రిజల్ట్ ట్యాబ్ ను క్లిక్ చేయాలి.
- అనంతరం Class XII or Class X Re-evaluation/Verification result లింక్ పై క్లిక్ చేయాలి.
- రోల్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి.
- స్క్రీన్ పై రిజల్ట్స్ కనిపిస్తాయి. ఫలితాలను డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.
- భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ ను ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.
Class XII- After Re-evaluation/Verification – Lot 1 Result 2023