తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Canada Student Visa : స్టడీ పర్మిట్​ ప్రక్రియలో భారీ మార్పులు చేసిన కెనడా!

Canada student visa : స్టడీ పర్మిట్​ ప్రక్రియలో భారీ మార్పులు చేసిన కెనడా!

Sharath Chitturi HT Telugu

28 October 2023, 7:20 IST

google News
    • Canada student visa : అంతర్జాతీయ విద్యార్థులను మోసాల నుంచి కాపాడేందుకు కెనడా కీలక నిర్ణయాలు తీసుకుంది. వెరిఫికేషన్​ ప్రక్రియలో పలు మార్పులు చేసింది.
స్టడీ పర్మిట్​ ప్రక్రియలో భారీ మార్పులు చేసిన కెనడా!
స్టడీ పర్మిట్​ ప్రక్రియలో భారీ మార్పులు చేసిన కెనడా!

స్టడీ పర్మిట్​ ప్రక్రియలో భారీ మార్పులు చేసిన కెనడా!

Canada student visa news : తమ దేశానికి వస్తున్న అంతర్జాతీయ విద్యార్థులను మోసాల నుంచి రక్షించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కెనడా. ఇకపై ప్రతి అప్లికెంట్​కు చెందిన లెటర్​ ఆఫ్​ యాక్సెప్టెన్స్​ని పోస్ట్​- సెకెండరీ డీఎల్​ఐ (డెసిగ్నేటెడ్​ లెర్నింగ్​ ఇన్​స్టిట్యూట్స్​)లు ఆమోదించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓ కొత్త వెరిఫికేషన్​ ప్రక్రియను తీసుకురానుంది. తాజా మార్పులు.. డిసెంబర్​ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

"అంతర్జాతీయ విద్యార్థులు.. కెనడాలో చదువుకునేందుకు వస్తున్నారు. కానీ కెనడా ఇంటర్నేషనల్​ స్టూడెంట్​ ప్రోగ్రామ్​లో మోసాలు జరుగుతున్నట్టు గుర్తించాము. స్టూడెంట్​కు వీసా పర్మీట్​ ఇచ్చే ముందు, వెరిఫికేషన్ ప్రక్రియలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది," అని ఓ నోటిఫికేషన్​ను విడుదల చేసింది కెనడా.

ఖలిస్థాన్​ విషయంలో ఇండియా- కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల పాటు వీసా జారీ ప్రక్రియను నిలిపివేసిన ఇండియా.. ఇటీవలే పునరుద్ధరించింది. ఇండియా ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే.. కెనడా.. తన స్టూడెంట్​ వీసా వెరిఫికేషన్​ ప్రక్రియలో మార్పులు తీసుకురావడం గమనార్హం.

Canada student program : "మోసాలకు సంబంధించిన దర్యాప్తుల నేపథ్యంలో ఈ ఏడాది.. చాలా మంది విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. కొత్త ప్రాసెస్​తో ఈ ఇబ్బందులు ఉండవు. లెటర్​ ఆఫ్​ యాక్సెప్టెన్స్​ కరెక్ట్​గా ఉంటే సరిపోతుంది," అని కెనడా ఇమ్మిగ్రేషన్​ మినిస్టర్​ మార్క్​ మిల్లర్​ తెలిపారు.

"పోస్ట్​ గ్రాడ్జ్యుయేషన్​ వర్క్​ పర్మిట్​లో నిబంధనలను మార్చేందుకు ఆలోచిస్తున్నాము. కెనడాలో ఉద్యోగులకు లబ్ధిచేకూరే విధంగా రానున్న రోజుల్లో మార్పులు చేస్తాము," అని కెనడా స్పష్టం చేసింది.

మోసాలు చేస్తున్నారా?

Canada student program reforms : ఇటీవలే.. 700కుపైగా మంది భారతీయ విద్యార్థులకు డిపోర్టేషన్​ లెటర్స్​ అందించింది కెనడా బార్డర్​ సర్వీస్​ ఏజెన్సీ. వీరిలో చాలా మంది పంజాబీలు ఉన్నారు. కెనడా వర్సిటీల్లోకి ప్రవేశించే ముందు.. వీరు ఫేక్​ అడ్మిషన్​ లెటర్స్​ సమర్పించారన్నది ప్రధాన ఆరోపణ.

డిపోర్టేషన్​ లెటర్స్​ అందుకున్న వారిలో చాలా మంది 2018లో కెనడాకు వెళ్లిన వారు ఉన్నారు. 5ఏళ్ల పాటు విద్యాసంస్థల్లో ఉన్నప్పుడు తమను ఏమీ అనలేదని, పర్మనెంట్​ రెసిడెన్సీ కోసం అప్లై చేసినప్పుడే ఇలా ఆరోపణలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

తదుపరి వ్యాసం