Ambedkar jayanti 2023 : బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి మీకు తెలియని విషయాలెన్నో!
13 April 2023, 11:00 IST
- Ambedkar jayanti 2023 : డా. బీ. ఆర్ అంబేడ్కర్‌కు 64 సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉందని మీకు తెలుసా? ఆయన రోజుకు 21 గంటలు చదువుకునే వారని మీకు తెలుసా? అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. ఇలాంటి ఎన్నో విషయాలను ఇక్కడ తెలుసుకుందాము..
హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బీ. ఆర్ అంబేడ్కర్ విగ్రహం
Ambedkar jayanti 2023 : 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లో జన్మించారు డా. బీ. ఆర్ అంబేడ్కర్. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్‌ను అంటరానివాడిగా చూసేవారు. స్కూల్‌కు వెళ్లినా వేరువేరుగా కూర్చోవాల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాస్‌రూమ్‌లోనే కూర్చోనిచ్చేవారు కాదు! ఇన్ని కష్టాల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన అంబేడ్కర్.. ఒక గొప్ప ఎకనామిస్ట్‌గా, జ్యూరిస్ట్గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేడ్కర్ సొంతం. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. ఆయన గురించి పలు ఆసక్తికర, ఎవరికి తెలియని విషయాలను నెమరవేసుకుందాము..
జయహో అంబేడ్కర్..
బాబాసాహెబ్ అంబేడ్కర్.. తన తల్లిదండ్రులకు 14వ సంతానం. ఆయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్‌జీ అంబేడ్కర్.
బీ. ఆర్ అంబేడ్కర్ అసలు ఇంటి పేరు అంబావాడేకర్. ఆ పేరును అంబేడ్కర్‌గా మార్చారు ఆయన టీచర్ మహదేవ్ అంబేడ్కర్.
Unknow facts about BR Ambedkar : విదేశాల్లో ఎకనామిక్స్ నుంచి పీహెచ్డీ పొందిన తొలి భారతీయుడు బాబాసాహెబ్ అంబేడ్కర్.
త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది పింగళి వెంకయ్య అన్న విషయం తెలిసిందే. అయితే.. జెండాలోకి అశోక చక్ర.. బీ.ఆర్ అంబేడ్కర్ వల్లే వచ్చింది!
నోబుల్ బహుమతి పొందిన ప్రొఫెసర్ అమర్త్య సేన్.. అబేడ్కర్ను 'ఫాథర్ ఆఫ్ ఎకనామిక్స్'గా సంబోధిస్తారు.
BR Ambedkar statue in Hyderabad : మధ్యప్రదేశ్, బీహార్ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాలను విభజించాలని 50వ దశకంలోనే చెప్పారు అంబేడ్కర్. 2000లో ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఆయన వ్యక్తిగత గ్రంథాలయం పేరు 'రాజ్‌గిర్'. అందులో 50వేలకుపైగా పుస్తకాలు ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ లైబ్రరీగా అది గుర్తింపు తెచ్చుకుంది.
ప్రపంచంలో టాప్ 100 స్కాలర్స్ లిస్ట్‌ను 2004లో తయారు చేసింది కొలంబియా యూనివర్సిటీ. ఈ జాబితాలో మొదటి పేరు డా. భీమ్రావ్ రామ్‌జీ అంబేడ్కర్‌ది! ఆయన రాసిన 'వెయిటింగ్ ఫర్ ఎ వీసా' పుస్తకం.. కొలంబియా వర్సిటీలో ఓ టెక్స్ట్‌బుక్.
BR Ambedkar quotes : బీ. ఆర్ అంబేడ్కర్‌కు 64 సబ్జెక్ట్‌లలో మాస్టర్స్ డిగ్రీ ఉంది! హిందీ, పాలీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ వంటి భాషలు ఆయనకు తెలుసు. వీటితో పాటు దాదాపు 21ఏళ్ల పాటు.. ప్రపంచంలోని అన్ని మతాల గురించి చదివారు.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో 8ఏళ్ల కోర్సును కేవలం 2ఏళ్ల 3 నెలల్లో పూర్తి చేశారు అంబేడ్కర్. ఇందుకోసం ఆయన రోజుకు 21 గంటలు చదువుకునేవారు.
అంబేడ్కర్‌తో పాటు ఆయన అనుచరులు 8,50,000 మంది బౌద్ధమతంలోకి మారారు. ప్రపంచంలో మతమార్పిడి విషయంలో ఇప్పటికీ ఇదే అతిపెద్దది!
బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను 'ది మోడర్న్ బుద్ధ ఆఫ్ దిస్ యేజ్ (ఈ తరం బుద్ధుడు)' అని పిలిచేవారు బౌద్ధ సన్యాసి మహంత్ వీర్ చంద్రమణి.
BR Ambedkar quotes in telugu : లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి "డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెన్స్" పీహెచ్డీ పొందిన తొలి, ఏకైక వ్యక్తి అంబేడ్కర్. ఆ తర్వాత చాలా మంది ప్రయత్నించినా, ఫలితం దక్కలేదు.
ప్రపంచవ్యాప్తంగా మరే ఇతర నేతకు కూడా లేనన్ని పాటలు, పుస్తకాలు అంబేడ్కర్‌పై రాశారు.
500 మంది పట్టభద్రులు, వేలాది మంది స్కాలర్స్ కన్నా ఒక్క బీ. ఆర్ అంబేడ్కర్ తెలివైన వారని మహాత్మా గాంధీ చెబుతూ ఉండేవారు.
ప్రపంచవ్యాప్తంగా.. మంచి నీటి కోసం సత్యాగ్రహం చేసిన తొలి, ఏకైక వ్యక్తి అంబేడ్కర్.
వెనకపడిన వర్గాల నుంచి వచ్చి లాయర్‌గా ఎదిగిన తొలి వ్యక్తి బీ. ఆర్ అంబేడ్కర్.
BR Ambedkar Jayanti 2023 latest news : "ది ప్రాబ్లెం ఆఫ్ రూపీ-ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్" పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. ఈ పుస్తకానికి పలు సూచనలు చేశారు అంబేడ్కర్.
ప్రపంచంలో ఎక్కడైనా.. కళ్లు మూసుకుని ఉన్న బుద్ధిడి విగ్రహాలు, పెయింటింగ్స్ మాత్రమే కనపడతాయి. మంచి పెయింటర్ అయిన బాబాసాహెబ్ అంబేడ్కర్.. తొలిసారిగా కళ్లు తెరిచి ఉన్న బుద్ధుడి రూపాన్ని పెయింట్ చేశారు.
అంబేడ్కర్‌కు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. కాగా.. అంబేడ్కర్ తొలి విగ్రహాన్ని 1950లో నిర్మించారు. అది కొల్హాపూర్‌లో ఉంది. అప్పటికి బీ. ఆర్ అంబేడ్కర్ జీవించే ఉన్నారు.