BOI Officer Recruitment 2024: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ
29 March 2024, 17:32 IST
BOI Officer Recruitment 2024: ఆఫీసర్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేటగిరీల్లో మొత్తం 143 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ bankofindia.co.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ప్రతీకాత్మక చిత్రం
Bank of India Officer Recruitment 2024: బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బీవోఐ (Bank of India) అధికారిక వెబ్సైట్ bankofindia.co.in ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో స్కేల్ 4 వరకు వివిధ విభాగాల్లో ఆఫీసర్లను భర్తీ చేయనున్నారు. మార్చి 27న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 ఏప్రిల్ 10న ముగియనుంది. వివిధ కేటగిరీల పోస్ట్ లకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవం మొదలైన విషయాలను బీవోఐ అధికారిక వెబ్సైట్ bankofindia.co.in లోని సమగ్ర నోటిఫికేషన్ లో చూడండి
ఎంపిక విధానం
ఈ రిక్రూట్మెంట్ లో దరఖాస్తుదారులు/ అర్హులైన అభ్యర్థుల సంఖ్యను బట్టి ఆన్లైన్ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, పోస్టుకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్, బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మినహా పై పరీక్షలు ద్విభాషా పద్ధతిలో అంటే ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష క్వాలిఫైయింగ్ స్వభావం కలిగి ఉంటుంది అంటే మెరిట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు ఇంగ్లిష్ లాంగ్వేజ్ లో సాధించిన మార్కులను కలపరు.
దరఖాస్తు ఫీజు
ఈ Bank of India పోస్ట్ లకు అప్లై చేయడానికి దరఖాస్తు ఫీజు జనరల్, ఇతరులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175. మాస్టర్/ వీసా/ రూపే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాష్ కార్డులు/ మొబైల్ వాలెట్లు, క్యూఆర్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.