తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర’’ కు అనుమతి నిరాకరించిన మణిపూర్ ప్రభుత్వం

Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర’’ కు అనుమతి నిరాకరించిన మణిపూర్ ప్రభుత్వం

HT Telugu Desk HT Telugu

10 January 2024, 15:34 IST

google News
    • Bharat Jodo Nyay Yatra: త్వరలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ రూట్ మ్యాప్ ను బుధవారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. రూట్ మ్యాప్ తో పాటు ఈ యాత్రలో పాలుపంచుకోవాలని కోరుతూ ఒక కరపత్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రూపొందించింది.
భారత్ జోడో న్యాయ్ యాత్ర కరపత్రాన్ని విడుదల చేస్తున్న కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్
భారత్ జోడో న్యాయ్ యాత్ర కరపత్రాన్ని విడుదల చేస్తున్న కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ (PTI)

భారత్ జోడో న్యాయ్ యాత్ర కరపత్రాన్ని విడుదల చేస్తున్న కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్

Bharat Jodo Nyay Yatra: భారత్ జోడో న్యాయ్ యాత్ర రూట్ మ్యాప్, కరపత్రాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం విడుదల చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర కరపత్రాలు, రూట్ మ్యాప్, యాత్ర ఉద్దేశాలను ఇరువురు సీనియర్ నేతలు మీడియాకు వివరించారు.

మణిపూర్ నుంచి..

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) ను ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే, ఇంఫాల్ లోని ప్యాలెస్ గ్రౌండ్స్ నుంచి ఈ యాత్రను ప్రారంభించే కార్యక్రమానికి అనుమతి ఇవ్వడానికి మణిపూర్ ప్రభుత్వం నిరాకరించిందని మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కీషామ్ మెగాచంద్ర తెలిపారు. మణిపూర్ లో శాంతిభద్రతల పరిస్థితి సున్నితంగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వివరించారు.

జనవరి 14 నుంచి

జనవరి 14న ప్రారంభం కానున్న ఈ యాత్ర 6,713 కిలోమీటర్లు కొనసాగుతుంది. ఈ యాత్ర ప్రధానంగా బస్సు ద్వారా కొనసాగుతుంది. మధ్య మధ్యలో రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా చేస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించే ఈ యాత్ర 66 రోజుల్లో 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాలు, 100 లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేస్తుంది.

తదుపరి వ్యాసం