తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అందమైన అమ్మాయిలు రైతుల కొడుకులను పెళ్లి చేసుకోరు : ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్

అందమైన అమ్మాయిలు రైతుల కొడుకులను పెళ్లి చేసుకోరు : ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్

Anand Sai HT Telugu

03 October 2024, 6:49 IST

google News
    • Farmers Sons : అందగత్తెలు రైతుల కుమారులను పెళ్లి చేసుకోరని మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వారికి ఉద్యోగం ఉన్న అబ్బాయిలు కావాలని ఎమ్మెల్యే మాట్లాడారు.
దేవేంద్ర భూయర్
దేవేంద్ర భూయర్

దేవేంద్ర భూయర్

మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే దేవేంద్ర భుయర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందమైన అమ్మాయిలు రైతుల కొడుకులను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై దుమారం రేగుతోంది. అందగత్తెలు రైతుల కొడుకునే చేసుకునేందుకు నిరాకరిస్తారని ఆయన అన్నారు. తన నియోజకవర్గం వరుద్ తహసీల్‌లో జరిగిన కార్యక్రమంలో రైతుల సమస్యల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

రైతు కుమారుడు అందవిహీనమైన అమ్మాయితోనే సరిపెట్టుకోకతప్పదని దేవేంద్ర భూయర్ అన్నారు. అందమైన అమ్మాయి ఉద్యోగం ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటుందన్నారు. అమ్మాయి మంచి అందగత్తె అయితే నీలాంటి వాడినో.. లేక నాలాంటి వాడినో చేసుకోదని దేవేంద్ర వ్యాఖ్యానించారు. మంచి ఉద్యోగం ఉన్నవాడినే భర్తగా ఎన్నుకుంటుందని చెప్పారు. రెండో శ్రేణికి చెందిన కొంతమంది అమ్మాయిలు కిరణా షాపు లేదా పాన్ షాపు నడుపుకొనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారని దేవేంద్ర పేర్కొన్నారు.

మూడో శ్రేణికి చెందిన అమ్మాయిలు మాత్రమే రైతు కుమారుడిని చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తారని అన్నారు. అందవిహీనంగా ఉన్న అమ్మాయిలు రైతు కుటుంబంలోకి వెళ్లేందుకు ఇష్టపడుతారని దేవేంద్ర భూయర్ అని వివాదాస్పద కామెంట్స్ చేశారు. అంతేకాదు.. వారికి పుట్టే పిల్లలు కూడా అందంగా ఉండరు అంటూ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే దేవేంద్ర భూయర్ చేసిన కామెంట్స్‌పై వైరల్ అయ్యాయి. పెద్ద దుమారం రేగింది. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంచ్రి యశోమతి ఠాకూర్ స్పందించారు. ఎమ్మెల్యే చేసిన కామెంట్స్‌ను ఖండించారు. మహిళల గురించి మాట్లాడే సమయంలో అలాంటి భాషను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

'అజిత్ పవార్, అధికారంలో ఉన్నవారు తమ ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవాలి. మహిళలను ఇలా వర్గీకరించడాన్ని ఎవరూ సహించరు. సమాజం నీకు గుణపాఠం చెబుతుంది.' యశోమతి ఠాకూర్ హెచ్చరించారు.

తదుపరి వ్యాసం