తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Yogi Adityanath Temple : యోగి ఆదిత్యనాథ్​పై ప్రేమతో.. గుడి కట్టేసిన ఆయోధ్యవాసి!

Yogi Adityanath temple : యోగి ఆదిత్యనాథ్​పై ప్రేమతో.. గుడి కట్టేసిన ఆయోధ్యవాసి!

Sharath Chitturi HT Telugu

19 September 2022, 17:57 IST

google News
    • Yogi mandir Ayodhya : ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​పై ప్రేమతో ఓ వ్యక్తి ఆయనకు గుడి కట్టాడు. ఈ ‘శ్రీ యోగి మందిర్​’.. ఆయోధ్యకు అత్యంత సమీపంలో ఉంది. 
లక్నోలో ఓ చిన్నారికి పోలియో టీకా వేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాత్​
లక్నోలో ఓ చిన్నారికి పోలియో టీకా వేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాత్​ (PTI)

లక్నోలో ఓ చిన్నారికి పోలియో టీకా వేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాత్​

Yogi Adityanath temple : రాజకీయ నేతలపై కొందరికి ఎనలేని అభిమానం, ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా సీఎంలకు ఫ్యాన్స్​ చాలా మంది ఉంటారు. తమ అభిమానాన్ని అనేక విధాలుగా చాటుకుంటారు. కొందరు పాలాభిషేకాలు, రక్తదానాలు చేస్తూ ఉంటారు. అయితే.. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​పై వీరాభిమానం ఉన్న ఓ వ్యక్తి.. ఆయన కోసం ఏకంగా ఓ గుడినే కట్టేశాడు. అది కూడా ఆయోధ్యకు అత్యంత సమీపంలో!

Yogi Mandir in Ayodhya : యోగి కోసం మందిరం..

రాముడి మందిరం నిర్మాణ దశలో ఉన్న ఆయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది కల్యాణ్​ భందర్స. ఇక్కడ మౌర్య కా పూర్వ అనే లొకాలిటీ ఉంది. ప్రభాకర్​ మౌర్య అనే వ్యక్తి ఇక్కడ నివాసముంటున్నాడు.

ప్రభాకర్​ మౌర్య.. ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు వీరాభిమాని. ఇప్పటికే ఆయన పేరు మీద ఎన్నో పాటాలు పాడాడు. ఇక ఇప్పుడు.. ఆ ప్రాంతంలో యోగి ఆదిత్యనాథ్​ కోసం గుడి నిర్మించాడు. ఆ గుడికి 'శ్రీ యోగి మందిర్​' అని పేరు పెట్టాడు.

శ్రీ యోగి మందిర్​లో యోగి ఆదిత్యనాథ్​ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. యోగి ఆదిత్యనాథ్​.. విల్లు పట్టుకున్న రాముడిలాగా ఉన్నారు.

Yogi Adityanath : "ఆయోధ్యలో రాముడి మందిరాన్ని నిర్మిస్తున్నారు యోగి ఆదిత్యనాథ్​. అందుకే ఆయన కోసం ఓ గుడిని నిర్మించాలని నేను నిశ్చయించుకున్నా," అని మౌర్య వెల్లడించాడు.

శ్రీ యోగి మందిర్​కు స్థానికులు రోజు ఉదయం, సాయంత్రం వెళతారు. యోగి ఆదిత్యనాథ్​ విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. హారతి ఇస్తారు. ఆయన పేరుతో పాటలు పడతారు.

ప్రభాకర్​ మౌర్య.. ఓ యూట్యూబర్​. ఆయన ఎన్నో పాటలు పాడాడు. గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యోగిపై పాడిన పాటలు హిట్​గా మారడంతో ఆయన ఫేమస్​ అయ్యాడు.

<p>యోగి ఆదిత్యనాథ్​ విగ్రహం</p>

Ayodhya Ram mandir : ఆయోధ్య రామ మందిర నిర్మాణం..

ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణం వేగంగా సాగిపోతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మందిరాన్ని నిర్మిస్తున్నారు. 2024 మొదటి రెండు, మూడు నెలలోపు ఆయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

తదుపరి వ్యాసం