తెలుగు న్యూస్  /  National International  /  Ayodhya Ram Mandir 6 Million Year Old Nepali Shaligram Stone Know Full Details

Ayodhya Ram Mandir: 6కోట్ల ఏళ్లనాటి శిలతో అయోధ్య శ్రీరాముడి విగ్రహం: శాలిగ్రామ శిల విశిష్టత ఇదే

02 February 2023, 12:46 IST

    • Ayodhya Ram Mandir - Shaligram stones: అయోధ్య రాముడి విగ్రహం ఎంతో విశిష్టమైన శాలిగ్రామ శిలతో తయారు కానుంది. నేపాల్ గండకీ నుంచి ఈ శిలలు ఆయోధ్యకు చేరుకున్నాయి. ఈ శిల విశిష్టత ఏంటంటే..
Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న శాలిగ్రామ శిల ఇది
Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న శాలిగ్రామ శిల ఇది (PTI)

Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న శాలిగ్రామ శిల ఇది

Ayodhya Ram Mandir - Shaligram stones: అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఉత్తర ప్రదేశ్‍లోని ఈ ప్రసిద్ధ ప్రాంతంలో అయోధ్యలో శ్రీరాముడి ఆలయం (Ayodhya Ram Temple) వైభవోపేతంగా నిర్మితమవుతోంది. ఈ ఆలయంలో శాలిగ్రామ శిలతో తయారు చేసిన శ్రీరాముడి విగ్రహం కొలువుదీరనుంది. నేపాల్‍లోని కాలీ గండకీ (Kali Gandaki) నది నుంచి వెలికి తీసిన శాలిగ్రామ శిలతో అయోధ్య ఆలయం కోసం రాముడి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ శాలిగ్రామ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి.

నేపాల్ నుంచి అయోధ్యకు..

Ayodhya Ram Mandir - Shaligram stones: నేపాల్ నుంచి రెండు ట్రక్కుల్లో మొత్తంగా సుమారు 30 టన్నుల బరువున్న రెండు శాలిగ్రామ రాతి ఫలకాలు నేడు (ఫిబ్రవరి 2) అయోధ్యకు వచ్చాయి. ఆచారాల ప్రకారం ఈ భారీ శిలలకు పూజలు జరుగుతున్నాయి. పూజల అనంతరం శిల్పులు విగ్రహాలను తయారు చేస్తారు. శాలిగ్రామ శిలలు 6కోట్ల సంవత్సరాల నాటివనే విశ్వాసం ఉంది.

60లక్షల ఏళ్ల నాటి శాలిగ్రామ రాతి విశిష్టత ఇదే

Ayodhya Ram Mandir - Shaligram stones: శ్రీ విష్ణువు అవతారంగా శాలిగ్రామ శిలలను హిందువు భావిస్తారు. ఈ శాలిగ్రామ రాతికి పూజలు చేస్తారు. నేపాల్‍లోని కాలీ గండకీ నది పరిసరాల్లో మాత్రమే ఈ శాలిగ్రామ శిలలు లభ్యమవుతాయి. హిమాలయాల నుంచి పారే ఈ నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తుంది. 33 రకాల శిలాజాలతో ఈ శాలిగ్రామ శిలలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ శిలలు 6కోట్ల ఏళ్ల నాటివనే విశ్వాసం ఉంది.

దేశవ్యాప్తంగా కొన్ని ఆలయాల్లో విగ్రహాల కోసం కూడా ఈ శాలిగ్రామ శిలలను వాడారు. విష్ణుమూర్తి అవతారంగా పురాతన కాలం నుంచి పూజలు అందుకుంటున్న ఈ రకం దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. శాలిగ్రామ శిలలను ఎక్కడ పూజిస్తే.. అక్కడ లక్ష్మీ దేవీ కటాక్షం ఉంటుందని చాలా మంది విశ్వసిస్తారు.

ఈ ఏడాదిలోనే పూర్తి..

Ayodhya Ram Mandir - Shaligram stones: 2024కు ముందే శాలిగ్రామ శిలతో అయోధ్య రాముడి విగ్రహం సిద్ధమవుతుంది. అయోధ్య రామమందిరంలో సీతాదేవి విగ్రహాన్ని కూడా శాలిగ్రామ శిలతో తయారు చేస్తున్నారు. ఈ రెండు విగ్రహాల తయారీ తర్వాత గర్భగుడిలో ప్రతిష్ఠ చేస్తారు.

2024, జనవరి 1వ తేదీన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ఓ సభలో చెప్పారు. మొత్తంగా అయితే ఈ ఏడాదిలోనే అయోధ్య రామాలయం పనులు పూర్తికానున్నాయి.