తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ayodhya's Ram Temple: 2024 జనవరి 1 నాటికి అయోధ్యలో రాామాలయం సిద్ధం

Ayodhya's Ram Temple: 2024 జనవరి 1 నాటికి అయోధ్యలో రాామాలయం సిద్ధం

HT Telugu Desk HT Telugu

05 January 2023, 19:04 IST

  • Ayodhya's Ram Temple: జనవరి 1 నాటికి అయోధ్యలో రాామాలయం సిద్ధమవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. త్రిపురలో గురువారం జన విశ్వాస యాత్రలో అమిత్ షా పాల్గొన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (File)

కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Ayodhya's Ram Temple: ఈ సంవత్సరం అెసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న త్రిపురలో గురువారం బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. బీజేపీ జన విశ్వాస యాత్రను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. దాదాపు 3 దశాబ్దాలు కొనసాగిన కమ్యూనిస్ట్ పాలనతో త్రిపుర అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు.

Ram Temple in Ayodhya: అయోధ్యలో రామాలయం

అయోధ్యలో భవ్యమైన రామాలయం నిర్మాణమవుతోందని, అది వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి సిద్ధమవుతుందని అమిత్ షా వెల్లడించారు. ఆ ఆలయ సందర్శన కోసం టికెట్లు బుక్ చేసుకోండి అని త్రిపుర ప్రజలకు సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, అయోధ్యలో రామాలయం ఏర్పాటును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటూ వచ్చిందని అమిత్ షా విమర్శించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాతనే రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే, మోదీజీ అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభించారని గుర్తు చేశారు.

కమ్యూనిస్టులపై విమర్శలు

త్రిపురలో దాదాపు 3 దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కమ్యూనిస్టులపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టుల పాలనలో హింస, అవినీతి, చొరబాట్లు, డ్రగ్స్ సరఫరా విచ్చలవిడిగా జరిగిందని షా ఆరోపించారు. కమ్యూనిస్టుల పాలన అంతమైన తరువాతనే అభివృద్ధి ప్రారంభమైందన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం