తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Case Against Rahul Gandhi: కాంగ్రెస్ కార్యకర్తలు బబ్బర్ షేర్ లన్న రాహుల్ గాంధీ; ఆయనపై కేసు నమోదు చేయాలన్న అస్సాం సీఎం

Case against Rahul Gandhi: కాంగ్రెస్ కార్యకర్తలు బబ్బర్ షేర్ లన్న రాహుల్ గాంధీ; ఆయనపై కేసు నమోదు చేయాలన్న అస్సాం సీఎం

HT Telugu Desk HT Telugu

23 January 2024, 14:21 IST

google News
  • Case against Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన

     భారత్ జోడో న్యాయ్ యాత్రను అస్సాం రాజధాని గువాహటిలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, అస్సాం పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

భారత్ జోడో న్యాయ యాత్ర లో రాహుల్ గాంధీ
భారత్ జోడో న్యాయ యాత్ర లో రాహుల్ గాంధీ (PTI)

భారత్ జోడో న్యాయ యాత్ర లో రాహుల్ గాంధీ

Case against Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పై కేసు నమోదు చేయాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. ఈ విషయాన్ని అస్సాం సీఎం శర్మ స్వయంగా ట్విటర్ లో వెల్లడించారు.

ఘర్షణలు..

మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం అస్సాంలో కొనసాగుతోంది. అయితే, యాత్రను గువాహటిలో ప్రవేశించకుండా అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. ఈ యాత్ర వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. అది తీవ్రమై ఘర్షణలకు దారి తీసింది. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ చార్జి చేశారు. దాంతో, ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.

ప్రజలను రెచ్చగొట్టారని..

ఈ నేపథ్యంలో.. ప్రజలను రెచ్చగొట్టినందుకు రాహుల్ గాంధీ (RahulGandhi) పై కేసు నమోదు చేయాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. రెచ్చగొట్టే చర్యలు అస్సామీ సంస్కృతిలో భాగం కాదన్నారు. తమది శాంతియుత రాష్ట్రమని, ఇలాంటి 'నక్సలైట్ ఎత్తుగడలు' అస్సాం సంస్కృతికి పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు. ‘‘జనాన్ని రెచ్చగొట్టినందుకు @RahulGandhi మీ నాయకుడిపై కేసు నమోదు చేయాలని నేను @DGPAssamPolice ఆదేశించాను. మీ హ్యాండిల్స్ లో మీరు పోస్ట్ చేసిన ఫుటేజీని సాక్ష్యంగా ఉపయోగించండి" అని అస్సాం ముఖ్యమంత్రి శర్మ కాంగ్రెస్ ను ఉద్దేశించి ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు.

5000 వేల మంది కార్యకర్తలు..

అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) ’ కొనసాగుతున్న నేపథ్యంలో, రాహుల్ గాంధీతో పాటు గౌహతిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన సుమారు 5,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగి పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టారు. జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా గువాహటి సరిహద్దుకు సమీపంలో జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తమ పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ నిబంధనలను ఉల్లంఘించరని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించరని స్పష్టం చేశారు. అయితే, దాని అర్థం తమ కార్యకర్తలు బలహీనులని కాదని వ్యాఖ్యానించారు.

బబ్బర్ షేర్ లు..

నిబంధనలనకు అనుగుణంగా నడుచుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంగా లాఠీ చార్జి చేశారని, సంయమనంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను బలహీనులుగా భావించవద్దని హెచ్చరించారు. ‘‘అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీనిబంధనలను ఉల్లంఘిస్తుంటారు. కానీ మనం (కాంగ్రెస్) అలాంటి పని చేయబోము. అయితే, దీని అర్థం మనం బలహీనంగా ఉన్నామని కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు 'బబ్బర్ షేర్' లుఅని బస్సుపై నిలబడి నినదించారు. అస్సాంలోని విద్యార్థులు రాహుల్ గాంధీతో కలవకుండా చూడాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అస్సాం సిఎం శర్మను ఆదేశించారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

తదుపరి వ్యాసం